ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై జరుగుతున్న అరాచకాలు అక్కడి ప్రభుత్వానికి తలనొప్పి తెచ్చిపెడుతోంది. రోజుకో ఘటన జరుగుతుండడంతో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం కొందరు చేస్తున్నట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. అన్యమత ప్రచారం.. అంతర్వేది ఘటనతోపాటు ఇటీవల పలు ఆలయాలపై దుండగులు అరాచకానికి పాల్పడ్డారు. వీటన్నింటి నేపథ్యంలో పోలీసు శాఖ ఓ నిర్ణయం తీసుకుంది.
Also Read: కబ్జాదారులకు షాక్ ఇవ్వబోతున్న జగన్ సర్కార్…?
అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామిని తెలుగు రాష్ర్టాలకు చెందిన భక్తులు ఎంత ఇష్టంగా కొలుస్తారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా మందికి ఆయనే ఇంటి దైవం. ఇంతటి ప్రసిద్ధి ఉన్న అంతర్వేదిలో రథం దగ్ధం కావడంతో ఒక్కసారిగా ఈ ఘటన పెను సంచలనమైంది. ఇప్పటికే దీనిపై జగన్ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏపీ పోలీసులు అప్రమత్తమై కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు జియో ట్యాగింగ్ చేయాలని ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లు, సర్కిల్ ఆఫీస్, సబ్ డివిజన్, యూనిట్ రేంజ్ ఆఫీసర్లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.
Also Read: చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమ ఎన్టీఆర్ పై లేదా…?
ఆలయాలపై దాడులు ప్రభుత్వానికి మరకలా దాపరిస్తుండడంతో మొత్తానికి పోలీసు శాఖ అరమత్తమైంది. జియో ట్యాగింగ్ చేస్తే ఎలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకోవచ్చని భావిస్తున్నారు. దీంతోనైనా ఈ దాడులు ఆగుతాయో లేదో చూడాలని పలువురు అంటున్నారు.