
‘పేదోళ్లకే అన్ని రూల్స్.. పెద్దోళ్లకు ఏ రూల్స్ వర్తించవు’ అని మనం చాలా సందర్భాల్లో వింటుంటాం. చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. చివరకు ఆలయాలకు వెళ్లినప్పుడు కూడా పెద్ద వారికి పెద్ద మర్యాదలే చేస్తుంటారు. ఏదైనా టూరిజం స్పాట్‌కి వెళ్లినా అక్కడా అదే పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపైనా ప్రజల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read:తండ్రీకొడుకులుగా మహేష్ బాబు..!
కరోనా వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం స్పాట్‌లను మూసివేసింది. ఎవరూ సందర్శించడానికి వీలు లేదని చెప్పింది. తాజాగా అన్‌లాక్ ప్రాసెస్ నడుస్తున్నా ఎక్కడా పర్మిషన్ ఇవ్వలేదు.
ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ స్నేహితులతో కలిసి రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అడ్డుకోవాల్సింది పోయి.. అటవీ శాఖ అధికారులు దగ్గరుండి మరీ జలపాతం ప్రత్యేకతలను వారికి వివరించారు.
Also Read: బిగ్ బాస్-4: అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఎవరికంటే?
అయితే, కరోనా నేపథ్యంలో పర్యాటకులను అనుమతించని అధికారులు.. ప్రముఖులకు మాత్రం మర్యాదలు చేయడం ఏమిటన్న విమర్శలు స్థానికుల నుంచి వచ్చాయి. ఇటీవల నిర్మాత దిల్ రాజు కుటుంబంతో ఆయన జలపాతాన్ని సందర్శించారని తెలుస్తోంది. వీరికి అనుమతి వెనుక అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాలున్నట్లు తెలుస్తోంది.