అమిత్‌ షాకు తిరగబెట్టిన ఆరోగ్యం.. ఎయిమ్స్‌లో చేరిక

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. శ్వాసకోశ సంబంధ సమస్యతో బాధపడుతుండగా శనివారం రాత్రి 11 గంటలకు ఆయనను ఎయిమ్స్‌లో చేర్చారు. ఎయిమ్స్‌ ఆసుపత్రిలోని కార్డియో న్యూరో టవర్స్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. Also Read: ‘ఇదే నేటి భారతం’ అంటూ కంగనాపై ప్రకాశ్ రాజ్ సెటైర్ అమిత్ షాను వీవీఐపీలకు కేటాయించిన సీఎస్‌ టవర్‌లో చేర్చి చికిత్స అందుస్తున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ […]

Written By: NARESH, Updated On : September 13, 2020 11:35 am

Amithsha

Follow us on

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. శ్వాసకోశ సంబంధ సమస్యతో బాధపడుతుండగా శనివారం రాత్రి 11 గంటలకు ఆయనను ఎయిమ్స్‌లో చేర్చారు. ఎయిమ్స్‌ ఆసుపత్రిలోని కార్డియో న్యూరో టవర్స్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: ‘ఇదే నేటి భారతం’ అంటూ కంగనాపై ప్రకాశ్ రాజ్ సెటైర్

అమిత్ షాను వీవీఐపీలకు కేటాయించిన సీఎస్‌ టవర్‌లో చేర్చి చికిత్స అందుస్తున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆధ్వర్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాల్సిన అవసరం ఏర్పడటం వల్లే ఎయిమ్స్‌లో చేర్చినట్లు తెలుస్తోంది.

రెండు వారాల వ్యవధిలో షా అనారోగ్యానికి గురికావడం ఇది రెండోసారి. కిందటి నెల 2వ తేదీన ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో గుర్‌గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందారు. తర్వాత నెగెటివ్‌ రావడంతో అదేనెల 14 తేదీన డిశ్చార్జి చేశారు. నాలుగురోజుల తరువాత ఆయన మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. 18న ఎయిమ్స్‌లో చేరారు. కరోనా వైరస్ నెగెటివ్ రిపోర్ట్ రావడం, ఆరోగ్యం మెరుగు పడటంతో 31వ తేదీన డిశ్చార్జి అయ్యారు.

Also Read: మోదీని ఎదురించే దమ్ము జగన్ కు ఉందా….?

అప్పటి నుంచి ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్న అమిత్‌ షా ఆరోగ్యం శనివారం రాత్రి తిరగబెట్టింది. శ్వాస పీల్చుకోవడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. డాక్టర్ల సూచనల మేరకు ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాల్సిన అవసరం ఏర్పడటం వల్లే ఎయిమ్స్‌ అడ్మిట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అమిత్ షాకు మరోసారి కరోనా పరీక్షలను నిర్వహించారా? లేదా? అనేది తెలియరావాల్సి ఉంది.