AP petrol crisis latest news: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలను ఇబ్బంది పెడుతోంది. విపక్షైసీపీఆయకులునిపై నిరసనలు తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఏపీలో ఈ పరిస్థితి నెలకొందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. పొరుగున ఉన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి కొరత లేదని కూటమి అధికారంలో ఉన్న ఏపీలో మాత్రం ప్రజలకు పెట్రోల్, డీజిల్ దొరకడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అయితే సమస్యకు ప్రధాన కారణాలు పానిక్ కొనుగోళ్లు, సరఫరా ఆలస్యాలు, పరిశ్రమల డిమాండ్ మార్పులు అని అధికారులు చెబుతున్నారు.
కొరత తీవ్రత
రాష్ట్రవ్యాప్తంగా 4,500కి పైగా పెట్రోల్ బంకుల్లో 10–70 శాతం మూతపడ్డాయి. కర్నూలు, నంద్యాల్, గోదావరి, విశాఖలో నో స్టాక్ బోర్డులు కనిపించాయి. రోజువారీ 6,330 కిలో లీటర్ల పెట్రోల్, 9 వేల కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలకు 50 శాతం అధిక డిమాండ్ ఏర్పడటంతో సంక్షోభం తీవ్రమైంది. దొరకదనే కారణంతో చాలా మంది అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు.
సమస్యకు ప్రధాన కారణాలు
పానిక్ భయంతో అనవసర కొనుగోళ్లు పెరగడం కొరతకు ప్రధాన కారణం. సాధారణ అమ్మకాలకు రెట్టింపు డిమాండ్ వచ్చింది. పారిశ్రామికులు అధిక ధరల కారణంగా రిటైల్ డీజిల్‌కు మారారు, వ్యవసాయ రంగంలో కూడా డిమాండ్ పెరిగింది. యుద్ధాలు, ఆయిల్ కంపెనీల రెండు రోజుల ఆలస్య సరఫరా, క్రెడిట్‌కు బదులు క్యాష్ డిమాండ్ కృత్రిమ కొరతను మరింత పెంచాయి.
ప్రభుత్వ చర్యలు..
సీఎం చంద్రబాబు పరిస్థితిపై సమీక్షలు నిర్వహించారు. అధిక సరఫరా కోరారు. . మంత్రి నాదెండ్ల మనోహర్ కొరత లేదని, పోయోకపోతే డీలర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రైవేటు సంస్థల సరఫరా ఆగిపోవడంపై కూడా చర్చించారు.
పానిక్ కొనుగోళ్లు తగ్గిస్తే సమస్య త్వరగా సద్దుమణుగుతుంది. ఆయిల్ కంపెనీలు సరఫరాను మెరుగుపరచాలి, పరిశ్రమలకు ప్రత్యేక సరఫరా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం డీలర్లను పరిగణనలోకి తీసుకుని, పారదర్శకత పెంచాలి.