Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Ministers Survey: మంత్రుల్లో గెలిచేది వారే.. ఏపీలో సంచలన సర్వే!

Andhra Pradesh Ministers Survey: మంత్రుల్లో గెలిచేది వారే.. ఏపీలో సంచలన సర్వే!

Andhra Pradesh Ministers Survey: ఏపీలో కూటమి పాలనకు రెండేళ్లు అవుతోంది. మూడో సంవత్సరంలో అడుగు పెట్టింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల పనితీరుపై అనేక రకాల విమర్శలు వచ్చాయి. మంత్రుల వ్యవహార శైలిపై కూడా అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. కానీ రెండేళ్ల పాలనలో భారీ వివాదాలు రాకుండా పూర్తి చేయగలిగారు పాలనను. ప్రభుత్వ పెద్దలపరంగా బాగానే కష్టపడుతున్నారు. దానికి తగ్గట్టుగానే మంచి ఫలితాలు వస్తున్నాయి. అయినా సరే ఈ రెండేళ్లలో లోపాలతో పాటు మైనస్లను సరి చేసుకుని ముందుకెళ్తేనే కూటమికి మరో ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల పనితీరుపై ఫీడ్ బ్యాక్ తెలుసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. ఇంకోవైపు ప్రముఖ మీడియా సంస్థలు సైతం అంచనా వేస్తున్నాయి.

* ఓ డిజిటల్ మీడియా సర్వే..
తాజాగా మంత్రుల పనితీరుపై ఓ ప్రముఖ డిజిటల్ మీడియా ఒక సర్వే చేసినట్లు తెలుస్తోంది. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలిచేవారు, పర్వాలేదనిపించుకున్న వారితో పాటు ఓడిపోతారు అనే విషయాన్ని ఆ సర్వే తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న సీఎం చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రుల్లో తొమ్మిది మంది కచ్చితంగా గెలుస్తారని సదరు సర్వే తేల్చి చెప్పింది
* సీఎం చంద్రబాబు కుప్పం నుంచి మరోసారి గెలుస్తారు అని ఈ సర్వే తేల్చింది. 1983 నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు చంద్రబాబు. 2019లో వైసీపీ గెలుపుతో పాటు కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. దీంతో వై నాట్ కుప్పం అని నినాదంతో ముందుకు సాగిన వైసీపీకి 2024 ఎన్నికల్లో షాక్ తప్పలేదు. మరోసారి కుప్పం నుంచి చంద్రబాబు కచ్చితంగా గెలుస్తారని ఈ సర్వే తేల్చింది.
* పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ మరోసారి తప్పకుండా గెలుస్తారని ఈ సర్వే ద్వారా తేలింది. మొన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు 70 వేలకు పైగా మెజారిటీ వచ్చింది ఈ నియోజకవర్గం నుంచి. మంత్రితో పాటు డిప్యూటీ సీఎం గా ఉండడంతో పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ఇక్కడ ప్రజలు మరోసారి పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇస్తారు అని ఈ సర్వే ద్వారా తేలింది.
* మంగళగిరి నుంచి నారా లోకేష్ కచ్చితంగా గెలుస్తారు. మంత్రిగా ఉంటూ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.. అయినా సరే మంగళగిరి నియోజకవర్గాన్ని తన సొంత డబ్బులతో అభివృద్ధి చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కనివిని ఎరుగని అభివృద్ధి మంత్రంతో ముందుకు వెళ్తున్నారు. అందుకే అక్కడి ప్రజలు మరోసారి లోకేష్ కు అవకాశం ఇస్తారని తేలిపోయింది.
* టెక్కలి నుంచి మరోసారి కింజరాపు అచ్చం నాయుడు గెలుపు తధ్యమని తేలిపోయింది. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ గా ఉంది. ఆపై మంత్రికి మంచి ఇమేజ్ ఉంది. టెక్కలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారన్న పేరు ఉంది. అందుకే ఇక్కడ ప్రజలు మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.
* పాలకొల్లు నుంచి మరోసారి నిమ్మల రామానాయుడుకు ప్రజలు అవకాశం ఇవ్వనున్నారు. తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గం. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఒకసారి మాత్రమే ఓడిపోయింది. నిమ్మల రామానాయుడు నిత్యం ప్రజల్లోనే ఉంటారు. మంచి నేతగా పేరు ఉంది. ఇక్కడ వైసిపి కొత్త ప్రయోగాలు చేస్తోంది కానీ వర్కౌట్ కాలేదు.
* రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ మరోసారి గెలుస్తారని ఈ సర్వే ద్వారా తేలింది. అక్కడ ఆయన హ్యాట్రిక్ విజయం సాధించారు. స్థానికంగా మంచి పట్టు సాధించారు. సత్యప్రసాద్ను ఓడించేందుకు వైసిపి చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ అవేవీ వర్కౌట్స్ కాలేదు. ఈసారి కూడా ఆయనదే విజయం అని తేలిపోయింది.
* అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ మరోసారి కచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ నియోజకవర్గంలో టిడిపి తో పాటు వైసీపీకి పట్టు ఉంది. కానీ వ్యక్తిగతంగా గొట్టిపాటి రవికుమార్ తన ఇమేజ్ పెంచుకున్నారు. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసిన గెలుపు తథ్యం అన్నట్టు పరిస్థితి ఉంది. అందుకే మరోసారి ఆయన విజయం ఖాయమని తేలిపోయింది.
* గజపతినగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్ గెలుపు మరోసారి ఖాయం అన్నట్టు ఉంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. మంచి ఇమేజ్ ఉంది. అందుకే అక్కడి ప్రజలు ఆయన నాయకత్వానికి మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమైంది.
* నిడదవోలు నుంచి మరోసారి జనాలు కందుల దుర్గేష్ కు ఛాన్స్ ఇస్తారని ఈ సర్వే ద్వారా స్పష్టమైంది. పొత్తు ఉన్నంతవరకు నిడదవోలులో కూటమి గెలుపు ఖాయం. పైగా దుర్గేష్ గెలిచిన నాటి నుంచి నియోజకవర్గాన్ని తనదైన రీతిలో అభివృద్ధి చేస్తున్నారు. అది కలిసి వచ్చే అంశం. ఇలా తొమ్మిది మంది కూటమి పాలనలో కచ్చితంగా గెలుస్తారు అని స్పష్టం కావడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular