AP Market Committees : ఏపీ ప్రభుత్వం( AP government ) దూకుడు మీద ఉంది. ఒకవైపు పాలన సాగిస్తూనే మూడు పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగుతోంది. పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఇప్పటికే పలు మార్కెట్ కమిటీలకు చైర్మన్ లను నియమించిన ప్రభుత్వం.. తాజాగా మరో 30 మార్కెట్ కమిటీలకు నూతన చైర్మన్ లను నియమించింది. వీరిలో 25 మంది టీడీపీ నేతలు, నలుగురు జనసేన నాయకులు, ఒకరు బిజెపికి చెందిన వారు ఉన్నారు. ఈ నియామకాలను ప్రజాభిప్రాయం ఆధారంగా చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. మూడు పార్టీల బలాబలాలు బట్టి ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Also Read : మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కు విశాఖ పోలీసులు షాక్!
* ఏఎంసీ చైర్మన్లు వీరే..
తాజాగా 30 మార్కెట్ కమిటీలకు( market committees ) సంబంధించి చైర్మన్ లను నియమించింది ప్రభుత్వం. వారితో పాటు చాలామందికి డైరెక్టర్లుగా అవకాశం ఇచ్చింది. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా బండి రామసూరారెడ్డి నియమితులయ్యారు. కాకినాడ నగరం నియోజకవర్గ నుంచి కాకినాడ ఏఎంసీ చైర్మన్గా బచ్చు శేఖర్, ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు ఏఎంసీ చైర్మన్ గా బొల్లా వెంకట్రావు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఏఎంసి చైర్మన్ గా బొందలపాటి అమరేశ్వరి, ఇచ్చాపురం ఏఎంసీ చైర్మన్ గా బుద్దా మణి చంద్రప్రకాష్, ఎర్రగొండపాలెం ఏఎంసీ చైర్మన్ గా చేకూరి సుబ్బారావు, గన్నవరం ఎస్సీ నియోజకవర్గంలోని అంబాజీపేట ఏఎంసీ చైర్మన్ గా చిట్టూరి శ్రీనివాస్, తణుకు నియోజకవర్గంలోని అత్తిలి ఏయంసి చైర్మన్ గా దాసం ప్రసాద్, చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల ఏఎంసీ చైర్మన్ గా సుధాకరయ్య, పుంగనూరు నియోజకవర్గంలోని సోమాల ఏఎంసీ చైర్మన్ గా కరణం శ్రీనివాసులు నాయుడు, పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం ఏఎంసీ చైర్మన్ గా భాస్కర్ నాయుడు, బనగానపల్లె ఏఎంసీ చైర్మన్ గా మల్లికార్జున్ రెడ్డి, నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల ఏఎంసీ చైర్మన్ గా కె వి సత్యనారాయణ, అవనిగడ్డ ఏఎంసీ చైర్మన్ గా కొల్లూరి వెంకటేశ్వరరావు, పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు ఏఎంసీ చైర్మన్ గా కొండ ప్రవీణ్ కుమార్, పాడేరు ఏఎంసి చైర్మన్ గా మచ్చల మంగ తల్లి, రాజమండ్రి ఏఎంసీ చైర్మన్ గా మార్ని వాసుదేవ్, కొవ్వూరు ఏఎంసీ చైర్మన్గా నాదెళ్ల శ్రీరామ్ చౌదరి, మైలవరం ఏఎంసీ చైర్మన్ గా నర్రా వాసు, పెడన నియోజకవర్గంలోని మల్లేశ్వరం బంటుమిల్లి ఏఎంసీ చైర్మన్ గా గొడుగు తులసిరావు, రైల్వే కోడూరు నియోజకవర్గంలోని కోడూరు ఏఎంసీ చైర్మన్ గా పగడాల వరలక్ష్మి, అనకాపల్లి ఏఎంసి చైర్మన్ గా పచ్చి కూర రాము, మైలవరం ఏఎంసీ చైర్మన్ గా పొనకల్ల నవ్య శ్రీ, మాడుగుల ఏఎంసీ చైర్మన్ గా పుప్పాల అప్పలరాజు, మచిలీపట్నం ఏఎంసీ చైర్మన్ గా వెంకట దుర్గాప్రసాద్, చంద్రగిరి ఏఎంసీ చైర్మన్ గా గౌస్ బాషా, ఉంగటూరు నియోజకవర్గంలోని భీమడోలు ఏఎంసీ చైర్మన్ గా శేషగిరి, జమ్మలమడుగు ఏఎంసీ చైర్మన్గా సింగం రెడ్డి నాగేశ్వర్ రెడ్డి, మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి ఏఎంసీ చైర్మన్ గా సయ్యద్ ఇమామ్ సాహెబ్, గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల ఏఎంసీ చైర్మన్ గా వీరాస్వామి నియామకం అయ్యారు.
* ఇంకా 103 పెండింగ్.. రాష్ట్రవ్యాప్తంగా( state wide) 218 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇప్పటికే మూడు విడతల్లో 115 కమిటీలకు సంబంధించి నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. ఇంకా 103 కమిటీలు ఖాళీగా ఉన్నాయి. వీటికి సైతం త్వరలో పాలకవర్గాలను నియమించనున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఏఎంసీల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
Also Read : గట్టి ప్రయత్నాలు చేస్తున్న పురందేశ్వరి!