Pooja Hegde : ఇన్ స్టాగ్రామ్ లో స్టార్ హీరోల కంటే, స్టార్ హీరోయిన్స్ కి అత్యధిక ఫాలోవర్లు ఉండడం ఇది వరకే మనం గమనించి ఉంటాము. స్టార్ హీరోలకు నాలుగైదు మిలియన్ల ఫాలోవర్లు ఉంటే, హీరోయిన్స్ కి కోట్లలో ఫాలోవర్లు ఉంటారు. శ్రద్దా కపూర్ వంటి హీరోయిన్స్ కి అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారు. రీసెంట్ గా ఇలా ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ గురించి పూజా హెగ్డే(Pooja Hegde) మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈమెకు ఇన్ స్టాగ్రామ్ లో 38 మిల్లియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈమె అప్లోడ్ చేసే ప్రతీ ఫొటోకు మిలియన్ కి పైగా లైక్స్ వస్తుంటాయి. ఆ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఇన్ స్టాగ్రామ్ ఫాలవర్ల గురించి అసలు నిజం చెప్పుకొచ్చింది.
Also Read : హీరోయిన్ శ్రీదేవి బయోపిక్ లో పూజ హెగ్డే..వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్!
ఆమె మాట్లాడుతూ ‘నాకు ఇన్ స్టాగ్రామ్ లో 38 మిల్లియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కానీ నా సినిమాని అంతమంది ఆడియన్స్ థియేటర్స్ లో చూడరు. నాకు ఉన్నటువంటి ఫాలోవర్లు పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కి కూడా లేరు. నాకే కాదు, చాలా మంది హీరోయిన్స్ కి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారు. వాళ్లంతా నిజమైన అభిమానులు కాదు. కేవలం మేము పెట్టే కంటెంట్ ని బట్టి వచ్చే వాళ్ళు వాళ్లంతా’ అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. దీనిని క్రికెట్ అభిమానులు, మరియు ఇతర హీరోల అభిమానులు తమ అభిమాన సెలబ్రిటీని మరో సెలబ్రిటీతో పోలుస్తూ కొంతమంది ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న ఫాలోవర్స్ ని చూసి ఏవేవో ఊహించుకుంటారు, కానీ అసలు నిజం ఇది అంటూ చెప్పుకొస్తున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు పూజా హెగ్డే మాట్లాడిన ఈ మాటలే కనిపిస్తున్నాయి.
ఇకపోతే తమిళ హీరో సూర్య(Suirya Sivakumar) తో కలిసి ఆమె ‘రెట్రో'(Retro Movie) అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం వచ్చే నెల 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా పూజా హెగ్డే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఈ వ్యాఖ్యలు చేసింది. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న పూజా హెగ్డే కి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం అత్యంత అవసరం. అదే విధంగా హీరో సూర్య కి కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆయన కూడా ఫ్లాప్స్ లోనే ఉన్నాడు, ముఖ్యంగా ఆయన గత చిత్రం ‘కంగువా’ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమా టీజర్, పాటలు అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ ని సొంతం చేసుకోవడంతో కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.
Also Raed : మమ్మల్ని డైరెక్టర్స్ ఆ విషయంలో తొక్కేస్తున్నారు : పూజా హెగ్డే
https://youtube.com/shorts/0fUDCkVrlss?si=t_jx0cWPnI4Y1bBJ