Easter: క్రిస్టియన్లకు ముఖ్యమైన పండుగల్లో ఈస్టర్ ఒకటి. ప్రతీ ఏడాది క్రిస్టియన్లు అందరూ కూడా ఈ ఈస్టర్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈస్టర్ పండుగను నిర్వహిస్తారు. అయితే ఈస్టర్ పండుగను వసంత కాలం మొదలైన తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం నాడు ఈస్టర్ పండును క్రిస్టియన్లు జరుపుకుంటారు. అయితే క్రిస్టియన్లు ఈ ఈస్టర్ పండుగను ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read: సూపర్ ఓవర్ లో RR ఐదు బంతులే ఎందుకు ఆడింది?
క్రిస్టియన్లకు ముఖ్యమైన రోజుల్లో ఈస్టర్ ఒకటి. అయితే యేసు క్రీస్తుకి శిలువ వేయడం వల్ల మరణిస్తాడు. దీంతో మూడో రోజున పునరుత్తానాన్ని క్రిస్టియన్లు ఈస్టర్ పండుగగా జరుపుకుంటారు. మరణానంతరం మూడో రోజున ఏసుక్రీస్తు మరణాన్ని జయించాడని, ఇది విజయానికి చిహ్నం అని, అలాగే పాపం నుంచి విముక్తిగా గుర్తిస్తారు. ఈ ఈస్టర్ పండుగతో క్రిస్టియన్లు లెంట్ సీజన్‌కు ఒక హ్యాపీ ఎండింగ్‌ను ఇస్తారు. అయితే ఈ ఈస్టర్ పండుగ నాడు ప్రార్థనలు, ఉపవాసం వంటివి చేస్తారు. వీటివల్ల పాపం నుంచి ప్రశ్చాత్తాపం చెందడానికి మాత్రమే సమయం కేటాయిస్తారని తెలుస్తోంది. అయితే ఏసుక్రీస్తు జ్ఞాపకార్థంగా జరుపుకునే ఈ ఈస్టర్ పండుగను గ్రెగరియేన్ క్యాలెండర్‌ను అనుసరించి చేసుకుంటారు. ఈ ఈస్టర్ అనే పది ఈస్ట్రే అనే ఒక పదం నుంచి వచ్చింది. ఇది ఒక సక్సన్ పదం. ఇది దేవతను సూచిస్తుంది. అయితే ఈ దేవత ఆరాధన కోసం ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. ఏసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి వచ్చాడనే ఉద్దేశంతో ఈస్టర్ పండుగను జరుపుకుంటారు.
ఏసుక్రీస్తు మరణం జయించిన తర్వాత ఏసుక్రీస్తును మెస్సియగా, జెరూసలేంకు ప్రభువుగా చేస్తారు. అయితే కొత్త రాజ్యానికి ఏసుక్రీస్తు ఒక కొత్త స్వర్గంగా బైబిల్ చెబుతోంది. అయితే ఈస్టర్ అంటే కేవలం ఏసుక్రీస్తు మాత్రమే కాదు.. సక్సన్ దేవత ఈస్ట్రేను ఆరాధించే రోజుగా కూడా ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. అయితే ఈస్టర్ రోజు విందులు జరుపుకునే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ ఏడాది ఈష్టర్ పండుగను ఏప్రిల్ 19వ తేదీన జరుపుకుంటారు. అయితే ప్రతీ ఏడాది ఒక్కో తేదీ మారుతుంది. అయితే ఈస్టర్ పండుగ రోజు బన్నీ, బాస్కెట్ ఆఫ్ క్యాండీ, ఈస్టర్ ఎగ్ హంట్స్ వంటి కొత్త సంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఏసు క్రీస్తు త్యాగానికి, స్వచ్ఛతకు గుర్తుగా ఈస్టర్ లిల్లిలతో చర్చిలు, ఇళ్లను అలంకరిస్తారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఏసుక్రీస్తు ఎడారిలో 40 రోజుల ఉపవాసదీక్ష చేస్తారు. దీనికి గుర్తుగా క్రిస్టియన్లు ఒక 40 రోజుల పాటు తమకి ఇష్టమైన ఒక సంప్రదాయాన్ని విడిచిపెడతారు. దీన్ని చివరకు పామ్ సండేగా పిలుస్తారు. ఇలా ఈస్టర్ పండుగ నాడు ఎన్నో కార్యక్రమాలను చేపడతారు. అన్ని విధాలుగా కూడా పాత కాలం నుంచి వస్తున్న సంప్రదాయాలను పాటిస్తారు.
Also Read: ఇప్పుడే కాదు.. గతంలోనూ ఢిల్లీ “సూపర్” విన్నరే.. ఎన్నిసార్లు ఇలా గెలిచిందంటే..