SI Sudhakar Yadav : మొన్న ఆ మధ్యన హైలెట్ అయ్యారు ఎస్సై సుధాకర్ యాదవ్( Si Sudhakar Yadav ). అనంతపురం జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుధాకర్ యాదవ్ పై జగన్మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఎస్సై సుధాకర్ యాదవ్ టిడిపి కార్యకర్తలా పని చేశారని.. తాము అధికారంలోకి రాగానే తప్పు చేసిన పోలీసులను బట్టలూడదీసి నిలబెడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వ్యవహారాలతోనే జగన్ ఈ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఎస్సై సుధాకర్ యాదవ్ జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అప్పటినుంచి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు టార్గెట్ అయ్యారు.
Also Read : ప్రతిపక్షాలకు ఇప్పుడు లోకేష్ రోల్ మోడల్.. కవిత ఏమన్నారంటే?
* టిడిపికి అనుకూలంగా పనిచేశారని..
రాప్తాడు నియోజకవర్గం లోని రామగిరి ( ramagiri) మండలంలో మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి వివాదం జరిగింది. అక్కడ టిడిపికి అనుకూలంగా ఎస్ఐ సుధాకర్ యాదవ్ పనిచేసారని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులకు బెదిరింపులకు దిగారన్నది ఎస్సై సుధాకర్ యాదవ్ పై ఉన్న ప్రధాన ఆరోపణ. మరోవైపు లింగమయ్య అనే వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్త హత్య కేసులో సైతం వివక్ష చూపారని ఎస్ఐ సుధాకర్ యాదవ్ పై జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలు జరిగిన తరువాత నేరుగా రామగిరి వెళ్లి బాధిత కుటుంబాలను, వైయస్సార్ కాంగ్రెస్ నేతలను పరామర్శించారు. ఈ క్రమంలోనే పోలీసుల వ్యవహార శైలిపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఎస్సై సుధాకర్ యాదవ్ ను టార్గెట్ చేసుకున్నారు.
* ఎస్సై సుధాకర్ యాదవ్ హాట్ కామెంట్స్..
అయితే జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy) పోలీసులను బట్టలు ఊడదీస్తానంటూ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. పోలీస్ అధికారుల సంఘం సైతం దీనిపై స్పందించింది. ఈ క్రమంలో రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ సైతం సెల్ఫీ వీడియోలో జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేశారు. పోలీసులను బట్టలూడదీయడానికి నువ్విస్తే వేసుకున్న బట్టలనుకున్నావా? అంటూ ఎస్ఐ సుధాకర్ యాదవ్ ప్రశ్నించారు. కష్టపడి చదివి, రన్నింగ్ రేసుల్లో పాసై వేసుకున్న యూనిఫామ్ ఇది అని.. నువ్వు ఇప్పుడు దానిని ఊడదీస్తానంటే అదేమీ అరటి తొక్క కాదన్నారు. మేం నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతామన్నారు. నిజాయితీగానే చస్తాం, అడ్డదారుల తొక్కం.. జాగ్రత్తగా మాట్లాడు అంటూ హెచ్చరించారు.
* కుటుంబ సభ్యులకు బెదిరింపు..
అయితే అప్పటినుంచి రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ కు( ramagiri Si Sudhakar Yadav ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దీనిపై స్పందించారు. సుధాకర్ యాదవ్ అవినీతిపరుడని.. ఆయన వ్యాఖ్యలకు పోలీసు యూనిఫామ్ సిగ్గుపడుతోంది అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియాతో పాటు ఆ పార్టీ శ్రేణులు రామగిరి ఎస్సై తీరుపై విరుచుకుపడుతున్నాయి. ఆయనతో పాటు కుటుంబాన్ని చంపేస్తామని హెచ్చరికలు, బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సుధాకర్ యాదవ్ కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. బెదిరింపు కాల్స్ పై సుధాకర్ యాదవ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తోంది.
రామగిరి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తోంది అంటే…మా పార్టీ కార్యకర్త ఇంటిపై రాళ్ల దాడి జరుగుతోందని ఫిర్యాదు చేస్తే..నిందితులను కాపాడే ప్రయత్నం చేశారు పోలీసులు. రామగిరి మండలాధ్యక్ష ఎన్నికల్లో జరిగిన గొడవల్లో బాధితులపైనే కేసులు పెట్టాడు ఎస్సై సుధాకర్ యాదవ్.
సుధాకర్ యాదవ్‌లాంటి… pic.twitter.com/Jh8IHLty9f— YSR Congress Party (@YSRCParty) April 10, 2025