Operation Sindoor: గత నెలలో జరిగిన ఈ ఘటన మన దేశాన్ని కలచివేతకు గురిచేసింది. ఈ ఘటన జరిగిన నాటి నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, క్యాబినెట్ మంత్రులు పహల్గాం ఘటనకు ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో.. దాయాది పాకిస్తాన్ దేశాన్ని ఎలా దెబ్బ కొట్టాలో… ప్రణాళికలు రూపొందించారు. తద్వారా భారీ స్కెచ్ రెడీ చేశారు. ఇదే క్రమంలో భారత సైన్యానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆ తర్వాత ఇంటిలిజెన్స్ డిపార్ట్మెంట్ పాకిస్థాన్లో ఉగ్రవాదమూకలు ఎక్కడ ఉన్నాయి? ఏ ప్రాంతంలో తిష్ట వేసుకుని కూర్చున్నాయి? ఏ ప్రాంతాల మీదుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి? ఎక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేశాయి? వంటి విషయాలను పూసగుచ్చినట్టు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ భారత త్రివిధ దళాలకు అందించింది. ఆ సమాచారాన్ని మరొకసారి రూఢీ చేసుకున్న తర్వాత… భారత త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. అంతే బుధవారం తెల్లవారుజామున దాడి మొదలైంది. చూస్తుండగానే.. ఏకకాలంలో క్షిపణులు మన భూభాగం నుంచి పాకిస్తాన్ భూభాగం మీదికి దూసుకువెళ్లాయి . పాకిస్తాన్ దేశంలో ఒక్క పౌరుడు కూడా మరణించకుండా.. ఆ దేశానికి సంబంధించిన ఇటుక కూడా విరగకుండా చేయాల్సిన నష్టం చేసి వచ్చాయి. హిజుబుల్ ముజాహిద్, జైషే మహమ్మద్, లష్కరే ఏ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కార్యాలయాలను.. ఆత్మహతి దళాలకు శిక్షణ ఇచ్చే కేంద్రాలను భారత్ ప్రయోగించిన క్షిపణులు ధ్వంసం చేశాయి.
Also Read: Operation Sindoor : ఆపరేషన్ సింధూర్ కోసం ఎగబడుతున్న బాలీవుడ్
పాక్ ను మోడీ ఇక వదిలిపెట్టడు..
పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన భారత త్రివిధ దళాలు.. ఈ క్రతువు ఎలా జరిగిందో వివరించాయి. ఈ వివరాలను వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత ఆర్మీలో పనిచేస్తున్న కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించిన తీరు యావత్ ప్రపంచాన్ని సైతం ఆలోచనలో పడేసింది. భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాల పై చేసిన దాడులకు సంబంధించి నిన్నటి నుంచి వివిధ రకాల నిపుణులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. అయితే భారత్ ఎందుకు ఉగ్రవాద శిబిరాలపై దాడులకు నేరుగా దిగింది? ప్రపంచ దేశాలను ఎలా ఒప్పించగలిగింది? పాకిస్థాన్లో ఒక్క ప్రాణం కూడా పోకుండా ఎలా చేయగలిగింది? అనే విషయాలను పూసగుచ్చినట్టు చెప్పిన వారిలో మాత్రం ప్రముఖ విశ్లేషకులు, టాప్ డిజిటల్ ప్లాట్ ఫామ్ “ఒకే తెలుగు” వెబ్ సైట్ వ్యవస్థాపకులలో ఒకరైన కటికి రామకోటేశ్వరరావు ముందు వరుసలో ఉంటారు. రామ్ టాక్స్ పేరుతో వర్తమాన విషయాలపై విశ్లేషణ చేసే ఆయన.. పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన దాడులకు సంబంధించి ఏబీఎన్ న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్లో రామకోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనదైన విశ్లేషణ చేసి.. ఏబీఎన్ డిబేట్ ప్రజెంటర్ రిషి అభినందనలు పొందారు.
Also Read: Dr Vinay Prasad : అమెరికాలో భారతీయుడికి మరో అందలం
రామ్ ఏమన్నారంటే..
“పాకిస్తాన్ గతంలో మన మీద అనేక సందర్భాల్లో దాడులకు పాల్పడింది. ముఖ్యంగా 2008లో మనదేశంలో ఉగ్రవాద వికృత క్రీడ చేసింది. ఆ ఘటన వల్ల మన దేశం పరువు ప్రపంచం ముందు పోయింది. నాటి ఘటనలకు భారత్ ప్రతీకారం తీర్చుకోలేదు. పైగా మనకంటే ఎంత చిన్నదైన పాకిస్తాన్ ముందు భారత్ తలవంచాల్సి వచ్చింది. కానీ మనదేశంలో ఇప్పుడు ఉన్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం. దాయాది దేశం వల్ల పడుతున్న ఇబ్బందిని అనేక సందర్భాల్లో ప్రపంచ దేశాల ముందు భారత్ ఉంచగలిగింది. పాకిస్తాన్ వల్ల ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో వివరించగలిగింది. అందువల్లే పాకిస్తాన్ ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. ఐఎంఎఫ్ లాంటి సంస్థలు ఇస్తున్న అప్పులతోనే నెట్టుకొస్తున్నది. భారత్ మీద నిత్యం విషం చిమ్మే పాకిస్తాన్.. పుల్వామా లాంటి దారుణానికి ఒడి కట్టింది. ఇక ఇటీవల పహల్గాం లాంటి దుర్మార్గానికి పాల్పడింది. ఇన్ని దారుణాలు చూసిన తర్వాత కూడా నరేంద్ర మోడీ ఎలా ఊరుకుంటారు. దెబ్బకు దెబ్బ అనే రేంజ్ లో దాడులకు పాల్పడటం మొదలుపెట్టారు. పాకిస్తాన్ దేశంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై కేవలం 24 నిమిషాల్లోనే దాడి చేశారు. అంతటి ఆయుధ సంపత్తి ఉన్న ఇజ్రాయిల్ కూడా హమాస్ పై ఇలాంటి దాడులకు పాల్పడలేదు. పైగా భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ వల్ల ఒక ప్రాణం కూడా పోలేదు. దీనినిబట్టి మోడీ చాకచక్యం.. త్రివిధ దళాలు పన్నిన వ్యూహం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తానని నరేంద్ర మోడీ శపథం చేశారు. దానికి తగ్గట్టుగానే ఆయన తన వ్యూహాలను అమలు చేస్తున్నారు. బలమైన నాయకుడు ఉన్న దేశం ఎప్పటికీ బలంగానే ఉంటుందని” రామకోటేశ్వరరావు తన విశ్లేషణ చేశారు. అంతేకాదు న్యూక్లియర్ వెపన్స్.. ఇతర ఆయుధ సామగ్రి గురించి కీలకమైన వివరాలను వెల్లడించారు. రెండు దేశాల మధ్య ఉన్న సైనిక పాటవం.. డిఫెన్స్ సామర్థ్యం గురించి గణాంకాలతో సహా రామ కోటేశ్వరరావు వివరించారు. భారత్ చేసిన దాడులకు సంబంధించి.. పాకిస్తాన్ చేసిన దుర్మార్గాలకు సంబంధించి తేదీలు, సంవత్సరాలతో సహా ఇంత స్పష్టంగా ఎవరూ చెప్పలేరు. అందుకే ఆపరేషన్ సింధూర్ పై రామకోటేశ్వర రావు చేసిన విశ్లేషణ ముందు వరసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.