Tollywood Star Heroine : అయితే మరి కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ కెరియర్ తామే నాశనం చేసుకుంటారు. కొంతమంది ముద్దుగుమ్మలు వాళ్లకు తెలిసో తెలియకో తప్పుడు నిర్ణయం తీసుకొని సినిమా ఇండస్ట్రీలో తమ కెరియర్ నాశనం చేసుకుంటున్నారు. వాళ్లలో ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఒకరు. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు తమ సత్తా చాటి స్టార్డం తెచ్చుకున్నారు. వీరిలో కొంతమంది మాత్రమే సినిమా ప్రేక్షకులకు ఎప్పటికీ బాగా గుర్తుంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాలీవుడ్ హీరోయిన్ కూడా ఒకరు. అప్పట్లో తెలుగులో ఏ సినిమా చూసినా కూడా ఈ హీరోయిన్ కనిపించేది. అప్పట్లో స్టార్ హీరోల సినిమాలలో ఈ హీరోయిన్ ను సెలెక్ట్ చేసేవారు. తెలుగుతోపాటు ఈ చిన్నది తమిళ్లో కూడా నటించే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అప్పట్లో తన అందంతో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసేది. కానీ ఎవరు ఊహించని విధంగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ బ్యాన్ అయ్యింది. ఆమె చేతులారా చేసుకున్న పనికి తెలుగు మరియు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో బ్యాన్ అయ్యింది. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఇలియానా కూడా ఒకరు.
Also Read : ‘రెట్రో’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే!
ముంబై కి చెందిన ఇలియానా దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ఇలియానా తన అందంతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాతో ఇలియానా బ్లాక్ బస్టర్ హీట్ అందుకుంది. పోకిరి సినిమా తర్వాత ఇలియానాకు తెలుగులో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డం సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇలియానా తెలుగుతోపాటు తమిళ్, హిందీలో కూడా వరుస అవకాశాలను అందుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో దశాబ్ద కాలంగా ఇలియానా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. తెలుగులో మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ బ్యూటీ. తెలుగులో బాగా క్రేజ్ ఉన్న సమయంలో ఇలియానా సడన్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంది. ఇది ఆయనకు సంబంధించిన ఈ విషయం గురించి గతంలో ఒక నిర్మాత తెలిపారు.
సినిమా ఇండస్ట్రీలో నిర్మాణ సంఘాలు చాలా బలంగా ఉంటాయి అన్న సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరో హీరోయిన్ల పై కూడా నిషేధం విధిస్తుంటారు. గతంలో ఇలియానా చేసిన ఒక పని వల్ల ఆమెను తెలుగుతోపాటు తమిళ్ సినిమాలలో కూడా బ్యాన్ చేయడం జరిగింది. గతంలో ఒక ఇంటర్వ్యూలో నిర్మాత ఒక సినిమా కోసం ఇలియానా అడ్వాన్స్గా 40 లక్షలు తీసుకొని డేట్స్ మాత్రం ఇవ్వలేదు. ఇదే విషయాన్ని ఇలియానాను అడిగితే నేను డేట్స్ ఇచ్చాను కానీ వాళ్ళు ఉపయోగించుకోలేదు అని తెలిపింది. ఆ తర్వాత నిర్మాతల సంఘం ఆ సమయంలో లాగ్ షీట్స్ అన్ని కూడా బయటకు తీసి చూస్తే అడ్వాన్స్ తీసుకున్న నిర్మాతలకు ఇచ్చిన డేట్స్ లో ఇలియానా మరొక సినిమాలో నటించడం జరిగింది. దాంతో ఇలియానా పై బ్యాన్ విధించాము. మా రూల్స్ మాకు ఉంటాయి. అడ్వాన్స్ తీసుకున్న తర్వాత సినిమా షూటింగ్ సెట్ కు వచ్చి నటించాలి లేకపోతే అడ్వాన్స్ డబ్బు తిరిగి ఇవ్వాలి. ఒక సినిమాకు అడ్వాన్స్ తీసుకొని వాళ్లకు డేట్స్ ఇచ్చి అవే డేట్స్ కి మరొక సినిమాలో నటించడం నేరం అని నిర్మాత తెలిపారు.
View this post on Instagram