AP High alert : ఏపీలో( Andhra Pradesh) భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు వేసవి తీవ్రత కొనసాగుతున్న వేళ అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఇటువంటి సమయంలోనే వాతావరణ శాఖ ఒక ప్రకటన చేసింది. రానున్న రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఒకవైపు మండే ఎండలు.. మరోవైపు భారీ వర్షాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణ శాఖ తాజా అప్రమత్తతతో అంతటా ఆందోళన నెలకొంది. ఈరోజు చాలాచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Also Read : ఏపీలో ఆ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక!
* భారీ ఉష్ణోగ్రతల నమోదు..
అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు( temperatures ) నమోదవుతున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువ కాకుండా నమోదవుతున్నాయి. రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు 402 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. శుక్రవారం 15 మండలాల్లో తీవ్రవడగాలులు, 28 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దాదాపు 100 ప్రాంతాలకు పైగా 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది.
* మరో రెండు రోజులు ఇలానే..
ఇంకోవైపు గడిచిన 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా( Ambedkar konasima district ) మధ్య కొంపలులో 86 మిల్లీమీటర్లు, రామచంద్ర పురంలో 73.5 మిల్లీమీటర్లు, కొత్తపేటలో 64.5 మిల్లీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా నివగంలో 52 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 48.7 మిల్లీమీటర్లు, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అయితే వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఉంటుంది. మరోవైపు అకాల వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా మామిడి పంటకు అపార నష్టం కలిగింది. అరటి ఇతరత్రా పంటలకు నష్టం తప్పలేదు. మరో రెండు రోజులపాటు వాతావరణం లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేసింది వాతావరణ శాఖ.
Also Read : ప్రభుత్వం గుడ్ న్యూస్.. వాళ్ళ అకౌంట్లో రూ.లక్ష రుణమాఫీ.. కండిషన్స్ ఇవే…