Homeఆంధ్రప్రదేశ్‌AP liquor scam ED investigation: మద్యం కుంభకోణం.. అలా డబ్బును మార్చారా.. ఈడి సంచలనం!

AP liquor scam ED investigation: మద్యం కుంభకోణం.. అలా డబ్బును మార్చారా.. ఈడి సంచలనం!

AP liquor scam ED investigation: మద్యం కుంభకోణం( liquor scam) కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. అయితే ఏపీ సిట్ కంటే ఇప్పుడు ఈడి వేగంగా స్పందిస్తోంది. స్టేట్ సిట్ కేవలం 11 కోట్ల రూపాయల ను సీజ్ చేస్తే.. ఈడీ ఏకంగా 400 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఫ్రీజింగ్ చేయడం విశేషం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం కుంభకోణం కేసు పై దృష్టి పెట్టింది. విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. దాదాపు 2800 కోట్ల రూపాయల వరకు స్కాం జరిగినట్లు అనుమానిస్తూ ఈ దర్యాప్తు ప్రారంభం అయింది. కానీ తాజాగా ఇది మాత్రం 3600 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగినట్లు స్పష్టం చేస్తోంది. మనీ లాండరింగ్ ద్వారా ఈ వ్యవహారం పకడ్బందీగా నడిపినట్లు అనుమానిస్తోంది. అయితే ఇంత మొత్తంలో అవినీతి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా అనేది అనుమానం. ఒకవేళ ఆయనే అంతిమ లబ్ధిదారుడు అయితే ఇంతవరకు ఎందుకు సిట్ కాని.. ఈడీ కానీ బయట పెట్టడం లేదు అనేది సామాన్యుడికి వచ్చే అనుమానం.

ఈడి వేగవంతంగా..
ముందుగా ప్రత్యేక దర్యాప్తు బృందం( special investigation team) విచారణను ప్రారంభించింది. మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. అయితే ఈడీ కంటే సీట్ ముందుగానే దర్యాప్తు ప్రారంభించిన ఆస్తులను జప్తు చేయలేదు. కానీ ఈడి మాత్రం వచ్చినట్టే వచ్చి 400 కోట్లకు పైగా ఫ్రీజింగ్ చేయడం ఆషామాషీ విషయం కాదు. లోతైన దర్యాప్తు చేస్తూ ఈ కేసులో భారీగా డబ్బులు చేతులు మారినట్లు అంచనా వేసి.. ఏ రూపంలో మనీ లాండరింగ్ జరిగిందో గుర్తించి సీజ్ చేయడం విశేషం.

ఆసక్తికర అంశాలు..
గమ్మత్తైన విషయాలను బయటపెట్టింది ఈడి( enforcement director rate ). వైసిపి హయాంలో ఏపీ బేవరేజెస్ ఎండి గా ఉండేవారు వాసుదేవ రెడ్డి. ఆయన ద్వారానే ఈ మద్యం కుంభకోణానికి ప్లాన్ చేశారు అనేది ఈడి బయటపెట్టింది. భారీగా మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డారు అని తేల్చింది. అప్పటివరకు మద్యం డిస్టలరీల నుంచి సప్లై, రిటైల్ షాపుల్లో అమ్మకాలు, మద్యం ఆర్డర్లు ప్రత్యేకంగా ఆన్లైన్లోనే జరిగేవి. దానికి ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ కూడా ఉండేది. కానీ మొత్తం మద్యం విధానమే జాతీయకరణ చేసి ప్రభుత్వమే నడుపుతున్నందున.. ఇక ఆన్లైన్ అవసరం లేదన్నది ఏపీ బేవరేజ్ సంస్థ ప్రతిపాదన. అలా అప్పటి వరకు సాగిన సాఫ్ట్వేర్ లావాదేవీలు.. మాన్యువల్ రూపంలోకి మారాయి. అప్పుడే అవినీతికి బీజం పడింది. మీరు తయారు చేసే నాసిరకం మద్యం విక్రయించాలి అంటే కేసుకు ఇంత ఇవ్వాల్సిందేనని ఏపీ బేవరేజెస్ ద్వారా డిష్టలరీలకు, మద్యం తయారు చేసే కంపెనీలకు ప్రతిపాదన పెట్టారు. ఒక్కో కేసుకు 60 నుంచి 70 రూపాయల కమిషన్ తీసుకున్నట్లు ఈడీ విచారణలో తేలింది. ఇలా నెలకు 100 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగినట్లు గుర్తించింది. దాదాపు 36 నెలల పాటు ఈ దందా కొనసాగినట్లు ఈడి విచారణలో తేలింది.

Also Read: జగన్ పాదయాత్రలో సంచలనాలు!

బంధువుల ద్వారా తిరిగి..
అయితే ఏపీ బేవరేజెస్ ఎండిగా వ్యవహరించిన వాసుదేవ రెడ్డికి( Vasudeva Reddy) చెందిన 95 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేసింది ఈడీ. ఆయన మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించింది. నేరుగా ఎక్కడ వాసుదేవరెడ్డి లంచం తీసుకోలేదు. తన కుటుంబ సభ్యులకు ఉన్న అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు, డైరీ కంపెనీలో డిస్టర్లరీలు, అవినీతి ద్వారా వచ్చిన సొమ్ముతో పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా వాసుదేవరెడ్డి అత్తవారి నుంచి తిరిగి గిఫ్టుల రూపంలో ఆస్తులు వాసుదేవరెడ్డి భార్యకు దాఖలు చేశారు. ఈడీ విచారణలో ఇలా అవినీతి సొమ్ముతో వచ్చిన ఆస్తులను గుర్తించి సీజ్ చేశారు. అయితే మద్యం కుంభకోణంలో దాదాపు 40 మంది వరకు ఉన్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగితే సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలియదా? తెలిసినా తనవారే కదా అని అవినీతికి ఒప్పుకున్నారా? అనేది ధర్మ సందేహం. కానీ ఎంత జరిగాక సమకాలీన అంశాలపై అవగాహన ఉన్నవారికి ఇట్టే అర్థమయిపోతుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular