Allu Arjun and Pawan Kalyan : సాధారణంగా ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం అనేది మన టాలీవుడ్ లోనే కాదు, ఏ ఇండస్ట్రీ లో అయినా సర్వసాధారణమే. రీసెంట్ సమయంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. అలాంటిదే ఇప్పుడు మరొక సంఘటన జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త. విషయంలోకి వెళ్తే అల్లు అర్జున్(Icon Star Allu Arjun), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే స్క్రిప్ట్ వర్క్ ఇంకా చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో ముందుగా అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీ తో ఒక సినిమాని చేయాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత త్రివిక్రమ్ తో చేస్తాడని టాక్ ఉంది. కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే, ఈ ఏడాది చివర్లో కానీ, లేదా వచ్చే ఏడాది ప్రారంభం లో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయబోతున్నాడట.
Also Read : ఆ ఒక్క విషయం వల్లే అల్లు అర్జున్ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ కామ్ గా ఉంటున్నాడు..?
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. రాబోయే రెండు నెలల్లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ చిత్రం తర్వాత ఆయన నేరుగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) బ్యాలన్స్ ఉన్న తన మూడు సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. రీసెంట్ గానే ‘హరి హర వీరమల్లు’ మూవీ ని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్. నేటి నుండి ఓజీ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టాడు. ఈరోజు నుండి జూన్ 10 వరకు నాన్ స్టాప్ గా ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఆ తర్వాత జూన్ 12 నుండి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.
ఈ ఏడాది చివరి లోపు ఈ చిత్రం షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత వెంటనే అయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నాడు. అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీ కార్తికేయ స్వామి జీవిత చరిత్ర ని ఆధారంగా చేసుకొని ఒక స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్క్రిప్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి షిఫ్ట్ అయ్యినట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా తనకు ఉన్న ఇమేజ్ కి ఇలాంటి సినిమాలు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయని, ఈ కథని బన్నీ ఒప్పుకొని తప్పుకుంటే నేను చేస్తాననే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని, త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో కోబలి చిత్రాన్ని చేయబోతున్నాడని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం అవుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.