AP Liquor Policy : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. 99కే వాటర్ మద్యంపై మందుబాబుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ప్రజల నుంచి మద్యం అమ్మకాలపై అభిప్రాయాలను తెలుసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయి? కల్తీ మద్యం సరఫరా అవుతుందా? ఆయా ప్రాంతాల్లో మద్యం రేట్లు ఎలా ఉన్నాయి? వంటి విషయాలను సర్వే ద్వారా తెలుసుకోనున్నారు. అయితే ఈ సర్వే ఎలా ఉంటుందంటే?
Also Read : ఏపీలో ఇంగ్లీష్ మీడియం చదవులు.. జగన్ కు చిక్కిన కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో ఇకనుంచి మద్యం షాపుల వద్ద క్యూఆర్ కోడ్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్లు మద్యం షాపులకు డబ్బులు చెల్లించేందుకు కాదు. వీటిని స్కాన్ చేయడం ద్వారా ఒక టేబుల్ వస్తుంది. ఆ టేబుల్ లో వివరాలు అందించాల్సి ఉంటుంది. ఇందులో ఆధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్ కూడా ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఇలా చేసిన తర్వాత మొత్తం ఐదు ప్రశ్నలు ఉన్న ఒక చాటు ఓపెన్ అవుతుంది. ఇందులో మద్యం బాబులు తమ జవాబులను అందించాలి. మల్టిపు ల్ ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఎవరైనా దీనిని స్కాన్ చేసుకోవచ్చు. ఇలా స్కాన్ చేసిన తర్వాత మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయో ఫీడ్బ్యాక్ కు వెళ్ళిపోతుంది.
వినియోగదారుల నుంచి మధ్య అమ్మ కాలపై అభిప్రాయాలు స్వీకరించేందుకు ప్రభుత్వం ఈ సర్వే నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే మద్యం షాపుల వద్ద క్యూఆర్ కోడ్లకు సంబంధించిన స్టిక్కర్లను అందించారు. అయితే ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా ప్రైవసీ దెబ్బతింటుందని కొందరు వినియోగదారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుందని.. ఈ ఫోన్ నెంబర్ తో తర్వాత తప్పుడు పనులకు ఉపయోగించే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఈ ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టినట్లు అవుతుందని చెబుతున్నారు.
గత ప్రభుత్వం కంటే ఇప్పటి ప్రభుత్వమే నాణ్యమైన మద్యం విక్రయిస్తుందని పేర్కొంటూ.. ఈ విషయాన్ని ప్రజల వద్ద నుంచే అభిప్రాయాలు స్వీకరించడం ద్వారా మద్యం విషయంలో తాము పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని చెప్పుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే చాలామంది మందుబాబులు ఈ విషయాన్ని పట్టించుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కానీ ప్రభుత్వ మాత్రం వినియోగదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని.. ఒకవేళ ఏదైనా కల్తీ మద్యం లేదా ఇతర అవసరాలను గుర్తించి వారికి అనుగుణంగా ప్రోడక్ట్ ను తీసుకురావాలని ఎక్సైజ్ భావిస్తుంది. ఇప్పటికే కొన్ని మద్యం షాపుల వద్ద ఇలాంటి స్టిక్కర్లు వెలిశాయి. ముందు ముందు మరిన్ని కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ సర్వే ఇంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.
Also Read : వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్.. అయినా సరే జైల్లోనే! కారణమదే