https://oktelugu.com/

AP Elections 2024: లైవ్ డిబేట్‌లో ఘోరంగా కొట్టుకున్న ఏపీ నేతలు

ఎన్నికల నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ డిబేట్ నిర్వహించింది. వైసీపీకి చెందిన చింతా రాజశేఖర్ , జనసేన కు చెందిన నాయకుడు విష్ణు నాగిరెడ్డి డిబేట్ కు హాజరయ్యారు.

Written By:
  • Dharma
  • , Updated On : March 3, 2024 / 11:15 AM IST

    AP Elections 2024

    Follow us on

    AP Elections 2024: ఏపీలో పొలిటికల్ హిట్ నెలకొంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో నేతలు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. ప్రచారాలను చాపకింద నీరులా విస్తరిస్తున్నారు. మరోవైపు దొరికిన ప్రతి వేదిక నుంచి తమ ప్రత్యర్థులను ఇరుకున పెట్టి ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. మరికొందరైతే సవాళ్లను విసురుకుంటున్నారు. అయితే ఎన్నికల సందర్భంగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఓపెన్ డిబేట్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఇద్దరు నేతలు కొట్టుకున్నారు. అందులో ఒకరు జనసేన నేతకాగా.. మరొకరు వైసీపీ నాయకుడు.

    ఎన్నికల నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ డిబేట్ నిర్వహించింది. వైసీపీకి చెందిన చింతా రాజశేఖర్ , జనసేన కు చెందిన నాయకుడు విష్ణు నాగిరెడ్డి డిబేట్ కు హాజరయ్యారు. ఆ ఇద్దరు నేతలు తమ పార్టీ వెర్షన్ వినిపించగా.. ఓ అంశంపై మాట్లాడే క్రమంలో ఇద్దరు ఆగ్రహానికి గురయ్యారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు వారిని వారించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజకీయ నేతలు ఇంతకు దిగజారిపోయారా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. పార్టీ విధానాలు చెప్పుకోవలే గాని ఇలా వ్యక్తిగత దాడులు చేసుకోవడం భావ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

    గతంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓపెన్ డిబేట్లో సైతం ఇటువంటి పరిస్థితి ఒకటి ఎదురయింది. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధి ఒకరు బిజెపి నేత చెంపను చెల్లుమనిపించారు. లైవ్ డిబేట్ కొనసాగుతుండగా ఇద్దరి మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఒకరినొకరు కవ్వింపు చర్యలకు దిగారు. చివరకు అందరూ చూస్తుండగానే అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధి బిజెపి నేత చెంపపై కొట్టారు. అప్పట్లో ఈ అంశం సంచలనంగా మారింది. ఓపెన్ డిబేట్ సమయంలో టీవీ ఛానల్ నిర్వాహకులు జాగ్రత్తలు పడ్డారు. నేతలు ఆవేశాలకు లోనైనప్పుడు నియంత్రించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ లో ఈ పరిస్థితి ఎదురు కావడం విశేషం. ఎన్నికల ముంగిట ఈ తరహా చిత్రాలు మరె న్ని చూడాలో.