Turtles: గుప్తనిధుల కోసం తవ్వుతుండగా.. విచిత్రమైన ఆకారం.. పరిశీలించి చూస్తే..

గుప్తనిధుల కోసం వారు తవ్వుతుండగా ఒక విచిత్ర ఆకారం కనిపించింది. దీంతో అది ఏంటో తెలుసుకునేందుకు వారు చుట్టూ ఉన్న మట్టిని మరింత జాగ్రత్తగా తొలగించారు.

Written By: Suresh, Updated On : March 3, 2024 11:23 am
Follow us on

Turtles: గుప్తనిధుల కోసం చాలామంది రకరకాల ప్రాంతాలలో తవ్వకాలు జరుపుకుంటారు. ఇందులో నిధులు ఎంతవరకు లభిస్తాయో తెలియదు గానీ.. అలాంటి తవ్వకాలు మాత్రం మంచివి కాదు. ఏదైనా కష్టపడి సంపాదించాలి. తపన పడి సాధించాలి. అంతేతప్ప గుప్త నిధి తవ్వకాలు జరిపితే బాగుపడతామని.. లంకె బిందెలు దొరికితే స్థిరపడతామని అనుకోవడం భ్రమ.. సరే ఆ విషయం పక్కన పెడితే కొంతమంది వ్యక్తులు ఇటీవల ఓ ప్రాంతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. అలా తవ్వకాలు జరిపితే నిధులు దొరుకుతాయని కొంతమంది చెప్పడంతో.. వారు ఆ పని చేశారు. కానీ కొంత లోతుకు తవ్విన తర్వాత అందులో కనిపించిన దృశ్యాన్ని చూసి వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. విచిత్రమైన రూపాన్ని చూసి షాక్ కు గురయ్యారు.

గుప్తనిధుల కోసం వారు తవ్వుతుండగా ఒక విచిత్ర ఆకారం కనిపించింది. దీంతో అది ఏంటో తెలుసుకునేందుకు వారు చుట్టూ ఉన్న మట్టిని మరింత జాగ్రత్తగా తొలగించారు. ఒక పెద్ద వింత జీవి ప్రాణంతో అటూ ఇటూ కదలడాన్ని చూసి ఆశ్చర్యపోయారు.. చివరికి వారు జాగ్రత్తగా పరిశీలించగా.. చాలా తాబేళ్ళు(turtles) కనిపించాయి. అవి కూడా ఒకదానిపై మరొకటి గోడలా పేర్చినట్టు ఉన్నాయి.. దీంతో ఆ తాబేళ్ళను చూసి వారు ఆశ్చర్యపోయారు. తాబేళ్ళు ఇలా కూడా ఉంటాయని వారిలో వారు చర్చించుకున్నారు.

వాస్తవానికి జలచరాలు నిద్రావస్థలో ఉంటాయి.. ఇందులో భాగంగా అవి సముద్రం, నది తీర ప్రాంతాన్ని ఇందుకు వేదికగా ఎంచుకుంటాయి. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన వారు తీర ప్రాంతాలను ఎంచుకోవడంతో.. వారికి నిద్రావస్థ లో ఉన్న తాబేళ్ళు కనిపించాయి. అయితే ఆ తర్వాత ఈ విషయం బయటికి పోవడంతో వారు అక్కడ నుంచి జారుకున్నారు. అయితే ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారా? నిందితులను పట్టుకున్నారా? అనేది తెలియ రాలేదు.. కాకపోతే ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఐదు మిలియన్ వ్యూస్ నమోదు చేసింది.