Home Minister Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాయల సీమలో రాజకీయ హింస ఆగడం లేదు. ప్రత్యర్థులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇవి అధికార టీడీపీ అనుకూల నేతలు చేయిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డవారు ఇప్పుడు ప్రతీకార దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న అశాంతి, ప్రజల్లో పేరుకుపోయిన అభద్రతా భావ పరిస్థితులపై హోం మంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీడియాపై అసహనం..
లా అండ్ ఆర్డర్‌పై ప్రశ్నించిన మీడియాపై ఏపీ హోం మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ‘మీరు హోం మంత్రిగా ఏం చేయలేకపోయారు కదా? అని ఓ రిపోర్టర అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ ‘‘నన్నేం చేయమంటారు?’ నేనే లాఠీ పట్టాలా.. లేక గన్ పట్టుకుని తిరగాలా? దేనికైనా టైం రావాలి. ఒకేసారి ఏం చేయలేం కదా.. దేనికైనా టైం పడుతుంది అని సమాధానం చెప్పారు.
సోషల్ మీడియాలో వైరల్..
దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రానికి హోం మంత్రిగా ఉండి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై వైసీపీ నాయకులు ట్రోల్ చేస్తున్నారు. అధికారం వనిత చేతిలో లేనట్లు ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు వెనుక ఉండి దాడులు చేయిస్తున్నారని కొందరు వైసీపీ నేతలు కామెట్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో హోం మంత్రి లాఠీలు, గన్ పట్టుకుని తిరగాలా అంటూ కొందరు విమర్శనాత్మక వ్యాఖ్యలు పోస్టు చేస్తున్నారు.
పెరుగుతున్న దాడులు..
ఇదిలా ఉంటే హో మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో దాడులు మరింత పెరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తానేం చేయాలంటూ అనిత చేతులు ఎత్తేయడాన్ని విశ్లేషకులు తప్పు పడుతున్నారు. పదవిలో ఉండి, నియంత్రించేస్థాయిలో ఉండి.. ఇలా వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని పేర్కొంటున్నారు. నెలకుపైగా సాగిన కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయని పేర్కొంటున్నారు. ఓవైపు రాజకీయదాడులు, మరోవైపు హత్యలు, లైంగికదాడులు, వేధింపులు కొనసాగుతున్నాయంటున్నారు.
ప్రధానికి జగన్‌లేఖ..
ఇదిలా ఉంటే.. ఏపీలో శాంతిభద్రతలపై ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. అధికార కూటమి నేతలు వైసీపీ నేతలపై జరుపుతున్న దాడులను లేఖలో ప్రస్తావించారు. నెల రోజుల్లోనే వందల మందిపై దాడులు జరిగాయని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.
లా&ఆర్డర్ దెబ్బతిన్నది అంటే – నేనేమన్నా చెయాలా లాఠీ పట్టుకుని అంటారేటి హోం మినిస్టర్ గారు? pic.twitter.com/tJCcSVdGLQ
— Hariswar Reddy (@hariswar_Reddy_) July 18, 2024