AP EAMSET : ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌.. తొలి విడత సీట్ల కేటాయింపు.. అలాట్‌ మెంట్‌ లింక్‌ ఇదే..

ఈ ఏడాది ఇంజినీరింగ్‌ విభాగంలో 2,74,213 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,58,374 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,95092 మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్‌ విభాగంలో 88,638 మంది దరఖాస్తు చేసుకోగా 80,766 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 70,352 మంది ఉత్తీర్ణత సాధించారు

Written By: Raj Shekar, Updated On : July 19, 2024 3:01 pm
Follow us on

AP EAMSET : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్‌ ఫేజ్‌లో భాగంగా సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ తర్వాత వెబ్‌ ఆప్షన్లు పూర్తి చేసిన వారికి సీట్లను కేటాయించారు. విద్యార్థులు పొందే కాలేజీ సీట్ల వివరాలను https://sche.aptonline.in/EAPCET/ / లింక్‌పై క్లిక్‌ చేసి తెలుసుకోవచ్చు. ఇందులో హాల్‌ టికెట్‌ నంబర్, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ ఎంట్రీ చేయగానే అలాట్‌ మెంట్‌ అర్డర్‌ డిస్‌ ప్లే అవుతుంది.

ఇలా చెక్‌ చేసుకోండి
ఏపీ ఎంసెట్‌ ఫస్ట్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులు https://sche.aptonline.in/EAPCET/ / వెబ్‌ సైట్‌లోకి వెళ్లాలి.
హోం పేజీలో కనిపించే డౌన్‌లోడ్‌ అలాట్‌మెంట ఆర్డర్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. ఇక్కడ మీ ఎంసెట్‌ హాల్‌ టికెట్‌ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
సబ్మిట్‌ బటన్‌ పై నొక్కితే అలాట్‌ మెంట్‌ అర్డర్‌ కాపీ డిస్‌ ప్లే అవుతుంది. తర్వాత
ప్రింట్‌ లేదా డౌన్లోడ్‌ ఆప్షన్‌ పై నొక్కి అలాట్‌ మెంట్‌ కాపీని పొందవచ్చు.

జులై 19 నుంచి తరగతులు..
సీట్ల పొందిన విద్యార్థులు జులై 17 నుంచి జులై 22 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. జూలై 19వ తేదీ నుంచే తరగతులు ప్రారంభం అవుతాయని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. బీ – ఫార్మసీ అడ్మిషన్లకు సంబంధించి ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు.

కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో పరీక్ష..
ఇదిలా ఉంటే ఏపీ ఈఏపీసెట్‌–2024 పరీక్షలను కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో మే 16 నుంచి 23 వరకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,851 మంది దరఖాస్తు చేసుకోగా, 3,39,139 మంది హాజరయ్యారు. అంటే 93.47 శాతం మంది పరీక్షలు రాశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి వీటి ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు.

ఇంజినీరింగ్‌కు ఎక్కువ దరఖాస్తులు..
ఈ ఏడాది ఇంజినీరింగ్‌ విభాగంలో 2,74,213 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,58,374 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,95092 మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్‌ విభాగంలో 88,638 మంది దరఖాస్తు చేసుకోగా 80,766 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 70,352 మంది ఉత్తీర్ణత సాధించారు.

మీ ర్యాంక్‌ ఇలా చెక్‌ చేసుకోండి?
స్టెప్‌ – 1 : అభ్యర్థులు ముందుగా ఈ వెబ్‌ సైట్‌ https://cets.apsche.ap.gov.in/ లింక్‌ పై క్లిక్‌ చేయండి.

స్టెప్‌ – 2 : అనంతరం హోంపేజీలో ఏపీ ఈఏపీసెట్‌ 2024 పై క్లిక్‌ చేయండి.

స్టెప్‌ – 3 : హోంపేజీలో రిజల్ట్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.

స్టెప్‌ – 4 : విద్యార్థి రిజిస్ట్రేషన్‌ నంబర్, హాల్‌ టికెట్‌ నంంబర్‌ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు.