AP Heat Wave: రాష్ట్రవ్యాప్తంగా( state wide ) ఎండలు మండుతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచి ఎండ ప్రభావం చూపుతోంది. మధ్యాహ్నం నుంచి సెగలు కక్కెలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. 139 ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో విచిత్ర పరిస్థితి ఉంది. సాయంత్రానికి మేఘావృతమై వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో ప్రజలు కొంత ఉపశమనం పొందుతున్నారు.
Also Read: మాజీ మంత్రి విడదల రజిని చుట్టు ఉచ్చు.. బెదిరింపు కేసులో కీలక అరెస్ట్!
* 139 ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు.. శ్రీకాకుళం( Srikakulam ) నుంచి అనంతపురం వరకు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 139 ప్రాంతాల్లో 41 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నంద్యాల జిల్లా దొర్నిపాడు లో 43.8, ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల లో 43.7, కడప జిల్లా అట్లూరులో 43.6, విజయనగరంలో 42.8, కర్నూలు జిల్లా కామవరం, పల్నాడు జిల్లా నర్మాలపాడు లో 42.7, జంగమహేశ్వరపురం లో 42.5, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు లో 42.4, నెల్లూరు జిల్లా మునుబోలు, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
* ఉపరితల ద్రోణితో వర్షాలు
మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాలో( Coastal area) అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం చత్తీస్గడ్ నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు కురిసాయి. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. అయితే వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో తప్ప.. మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదు కానున్నాయి. అయితే మే చివరి వారంలో రుతుపవనాల రాక ప్రారంభం వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఈ విషయంలో వాతావరణ శాఖతో పాటు విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేస్తోంది.
* 17 మండలాల్లో తీవ్ర వడగాలులు
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు మండలాలు, విజయనగరం( Vijayanagaram) జిల్లాలోని ఐదు మండలాలు, పార్వతీపురం మన్యంలో 8 మండలాలు.. ఇలా 17 మండలాల్లో తీవ్రవడగాలులు, 21 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది. శనివారం 12 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే భిన్నమైన ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో.. అజాగ్రత్తగా ఉంటే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వడదెబ్బకు గురికాకుండా వీలైనంత వరకు ఇంటికి పరిమితం కావాలని సూచిస్తున్నారు.
Also Read: మాధురి పోస్టింగ్.. దువ్వాడ ఊస్టింగ్!