Aadabidda Nidhi Scheme for Women: ఏపీలో( Andhra Pradesh) మహిళలకు గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం వారి హామీలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. ఈ క్రమంలోనే త్వరలో మరో పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే మహిళలకు శుభవార్త చెప్పింది. 18 సంవత్సరాలు నిండిన మహిళల ఖాతాల్లో 18 వేల రూపాయలు జమ చేసేందుకు సిద్ధమవుతోంది. అధికారంలోకి వస్తే 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలకు నెలకు 1500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ హామీ అమలుపై దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. ఈ ఏడాది నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తరుణంలో.. ప్రతి మహిళ ఖాతాలో ఆడబిడ్డ నిధి జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మహిళాభివృద్ధికి పెద్దపీట..
మహిళా సాధికారిత, మహిళా అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి( aada Bidda Nidhi) జమ చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి మహిళకు.. నెలకు 1500 రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ చేయనున్నారు. త్వరలో సీఎం చంద్రబాబు దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాకుండా.. వారి కుటుంబ ఆదాయాలను పెంచడమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకం తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. దీనిని అమలు చేసి మహిళల నమ్మకాన్ని పొందాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే మహిళలకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఆ జాబితాలో ఆడబిడ్డల నీది పథకం చాలా ఉంది.
పేద మహిళల కోసం..
బిపిఎల్( below poverty line) కుటుంబాల్లో మహిళలకు నెలకు 1500 రూపాయల సాయాన్ని అందించనున్నారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలు దీనికి అర్హులు. ఏడాదికి వీరికి 18 వేల రూపాయల ఆర్థిక సాయం అందం ఉంది. ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకున్న అర్హులు ఆన్లైన్, మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం ఆధార్ కార్డ్, వయసు నిర్ధారణ కోసం డాక్యుమెంట్లు బ్యాంక్ పాస్ అవసరం. ఈ ఆడబిడ్డ పథకం అమలు కోసం 2024-2025 బడ్జెట్లో రూ.3341.82 కోట్లు నిధులు కేటాయించింది కూటమి సర్కార్. మరోవైపు ప్రభుత్వం వెబ్సైట్ సైతం అందుబాటులోకి తెచ్చింది. అర్హులైన వారు వెబ్సైట్ https://ap.gov.in/ aadabiddalanidhi ను సంప్రదించవచ్చు. అయితే అధికారికంగా ఈ వెబ్సైట్ ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది.