AP New Pension Update: ఏపీ ప్రభుత్వం( AP government ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. భర్త చనిపోయిన వెంటనే వితంతువుకు పింఛన్ అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో వైసిపి ప్రభుత్వం ఈ విధానాన్ని నిలిపివేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది లబ్ధిదారులు ఎదురుచూపులు చూస్తూ వచ్చారు. అటువంటి వారికి శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య భర్త చనిపోయిన భార్యలకు పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది. అర్హులంతా వారి పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. భర్త పింఛన్ ఐడి, మరణ ధ్రువ పత్రం ఇవ్వడంతో వాళ్లను అర్హుల జాబితాలో చేర్చారు.
Also Read: ఏపీకి మూడు రోజులు హై అలెర్ట్.. ఏమవుతుందో?
ఎప్పటికప్పుడు వాయిదా
వాస్తవానికి వీరందరికీ..జూన్ 12న కూటమి ప్రభుత్వం( Alliance government ) అధికారంలోకి వచ్చి ఏడాది అయిన క్రమంలో పింఛన్లు ఇవ్వాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. జూలై మొదటి వారంలో పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. కానీ మళ్ళీ వాయిదా పడింది. అయితే ఆగస్టు 1న మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీరందరికీ పింఛన్లు అందించనున్నారు. ఆగస్టు 1న కొత్తగా లక్ష వరకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ప్రభుత్వం పై ప్రతినెలా రూ.43.66 కోట్ల భారం పడనుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రావు తెలిపారు. అయితే ఇకనుంచి భర్త చనిపోయిన వెంటనే ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకుంటే భార్యకు వితంతు పింఛను దక్కనుంది. ఇదో నిరంతర ప్రక్రియగా చేపట్టనుంది కూటమి ప్రభుత్వం.
Also Read: జగన్ పై గులకరాయి దాడి.. ప్రధాన నిందితుడు అదృశ్యం!
వారి పింఛన్లు తొలగింపు..
మరోవైపు దివ్యాంగులకు సంబంధించి పింఛన్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బోగస్ ధ్రువపత్రాలతో( bogus certificates ) పింఛన్లు పొందుతున్నట్లు ఆరోపణలు వచ్చిన క్రమంలో ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది. గత ప్రభుత్వంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వేలాదిమంది దివ్యాంగ పింఛన్లు పొందారని గుర్తించింది. అటువంటి వారి పింఛన్లు తొలగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 7.86 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. వీరిలో కొందరు నెలకు 6000 రూపాయల చొప్పున పింఛన్ తీసుకుంటున్నారు. అయితే చాలామందికి వైకల్యం లేకపోయినా.. ధ్రువపత్రాలు సృష్టించి అక్రమంగా తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మానసిక సమస్యలతో పాటు వినికిడి లోపం ఉందంటూ తప్పుడు ధ్రువపత్రాలతో పింఛన్లు పొందుతున్నట్లు తనిఖీల్లో తేలింది. అటువంటి వారిలో చాలామంది అనర్హులు ఉన్నారని.. త్వరలోనే సచివాలయాల వారిగా జాబితాలు ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.