Uday Kiran Movie Heroine: ఒకప్పటి లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. ఆమె ఈమేనా అని నెటిజెన్స్ వాపోతున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్?
మిలీనియం ఆరంభంలో వరుస విజయాలతో టాలీవుడ్ ని షేక్ చేశాడు ఉదయ్ కిరణ్. చిత్రం మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన ఆయన.. నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్ర విజయాలతో హ్యాట్రిక్ కొట్టారు. అరంగేట్రంతోనే మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అరుదైన హీరో ఉదయ్ కిరణ్. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉదయ్ కిరణ్ కి భారీ ఫేమ్ ఉండేది. అనంతరం ఉదయ్ కిరణ్ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఉదయ్ కిరణ్ కి అవకాశాలు తగ్గాయి. ఉదయ్ కిరణ్ నటించిన ప్లాప్ చిత్రాల్లో గుండె ఝల్లుమంది ఒకటి.
Also Read: నాగ వంశీ కి ఎన్టీఆర్ అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా..?
మదన్ గుండె ఝల్లుమంది చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్ కి జంటగా నటించిన అదితి శర్మ మీకు గుర్తుందా? అదితి శర్మ హిందీ పరిశ్రమ ద్వారా పరిచయమైంది. 2008లో విడుదలైన గుండె ఝల్లుమంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అదితి శర్మ గ్లామర్, నటన ఆడియన్స్ ని మెప్పించింది. గుండె ఝల్లుమంది చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం. అయితే గుండె ఝల్లుమంది బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.
గుండె ఝల్లుమంది అనంతరం ఓం శాంతి టైటిల్ తో మరొక తెలుగు సినిమా చేసింది. ఈ సినిమాలో కాజల్, నిఖిల్, నవదీప్, బిందు మాధవి లతో పాటు అదితి శర్మ ప్రధాన పాత్ర చేసింది. ఓం శాంతి సైతం అదితికి తెలుగులో బ్రేక్ ఇవ్వలేదు. ఇక అదితి తెలుగులో చేసిన చివరి చిత్రం బబ్లు. అదితి నటించిన తెలుగు చిత్రాల్లో ఒక్కటి కూడా ఆడలేదు. దాంతో టాలీవుడ్ కి దూరమైంది.
Also Read: మహేష్ బాబు – చిరంజీవి కాంబోలో మిస్ అయిన మూడు సినిమాలు ఇవేనా..?
ప్రస్తుతం పంజాబీలో అడపాదడపా చిత్రాలు చేస్తుంది. 2024లో చివరిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. మరోవైపు పలు సీరియల్స్, డిజిటల్ సిరీస్లలో అదితి నటించింది. 2014లో సర్వర్ అహుజా అనే నటుడిని అదితి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఒకప్పుడు స్లిమ్ అండ్ ఫిట్ గా ఉన్న అదితి లుక్ ప్రస్తుతం షాక్ ఇచ్చేలా ఉంది. ఆమె కొంచెం వళ్ళు చేసిన సూచనలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అదితి లుక్ వైరల్ అవుతుంది.
View this post on Instagram