Rain Alert AP: ఏపీ( Andhra Pradesh) వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన విపరీతల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ఉత్తరాంధ్రతో సహా ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో సైతం వర్షాలు పడుతున్నాయి. ఇదే పరిస్థితి మరో మూడు రోజులపాటు కొనసాగు నుండి. ఉపరితల ఆవర్తనం సైతం బలపడినట్లు తెలుస్తోంది. అల్పపీడనంగా రూపాంతరం చెంది బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. వచ్చే 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా కదులుతుందని.. మరింతగా బలపడడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కూడా చెబుతోంది వాతావరణ శాఖ. వాస్తవానికి నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడ్డాయి. కానీ లోటు కనిపించింది.
Also Read: కాంగ్రెస్ లో లేకున్నా నాకు సీఎం సీటు ఎందుకొచ్చిందంటే?.. బయటపెట్టిన రేవంత్
* పశ్చిమ వాయువ్య దిశగా..
ప్రస్తుతం బంగాళాఖాతంలో( Bay of Bengal ) ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. వచ్చే 48 గంటల్లో క్రమంగా పశ్చిమ బెంగాల్, ఒడిస్సా ఉత్తర ప్రాంతం వైపు కదిలేందుకు అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో శుక్ర,శని, ఆదివారాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని సూచిస్తోంది. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
* వర్షాలు పడే జిల్లాలు..
ఈరోజు శ్రీకాకుళం( Srikakulam), విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. విశాఖపట్నం, అనకాపల్లి,కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడి అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తోంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో సైతం వర్షాలు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కర్నూలు, తిరుపతి, అన్నమయ్య, రాయచోటి జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.