BNS 111 Sec: రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై చర్యలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.గత ఐదేళ్లుగాసోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు అత్యంత జుగుప్సాకరంగా ఉండేవి.ఒకరిద్దరూ యూట్యూబ్లో దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నటి శ్రీరెడ్డి అయితే ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు.వైసిపి సానుభూతిపరురాలుగా ఉన్న ఆమె వ్యాఖ్యలు సొంత పార్టీ వారికి నచ్చేవి కావు.అయితే ఆమె తాజాగా ఓ వీడియో విడుదల చేశారు.తన తప్పును క్షమించాలని నేతలందరినీ కోరారు. అయితే ఆమెలో పశ్చాత్తాపం కంటే భయమే ఎక్కువగా కనిపిస్తోంది.పోలీసుల అరెస్టులతో ఒక రకమైన ఆందోళన వ్యక్తం అవుతోంది. కానీ తాను ఇంతవరకు చేసిన అతి, వాడిన నీచాతిమైన భాష విషయంలో మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. అయితే ఆమెలో ఈ భయానికి కారణం మాత్రం ముమ్మాటికి అరెస్టులే. ఆపై సైబర్ నేరాల విషయంలో కఠిన చట్టాలు అమల్లోకి రావడంతో శ్రీరెడ్డి లాంటి వారిలో ఆందోళన ప్రారంభం అయింది.గతంలో భావ స్వేచ్ఛ ప్రకటన అంటూ సమర్ధించుకునేవారు. ఇండియన్ పీనల్ కోడ్ లో సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై కఠిన చర్యలు కనిపించేవి కావు. అందుకే 41 ఏ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకునేవారు. కానీ ఇకనుంచి ఆ పరిస్థితి ఉండదు. సైబర్ నేరాల విషయంలో కఠిన కేసులు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై ఆ కేసులనే నమోదు చేస్తున్నారు. అందుకే వారిలో అంత ఆందోళన ప్రారంభం అయ్యింది.
* సెక్షన్ 111 డేంజర్
ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో జూలై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అమల్లోకి వచ్చింది. అందులో సెక్షన్ 111 ప్రకారం సైబర్ నేరాలకు కఠిన శిక్షలు ఉన్నాయి. అసభ్య పోస్టులతో తాము ఎంతలా పేట్రేగిపోయినా పోలీసులు,చట్టాలు ఏమీ చేయలేవని.. మహా అయితే అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చి వదిలేస్తారని.. అంతకుమించి ఏమీ కాదంటూ రోజురోజుకు సైబర్ టీచర్లు గత ఐదేళ్లుగా రెచ్చిపోతూ వచ్చారు.చంద్రబాబు,పవన్ కళ్యాణ్,లోకేష్, వంగలపూడి అనిత లాంటి నేతల విషయంలో దుష్ప్రచారానికి దిగేవారు. దీనిని ఒక వ్యవస్థీకృతంగా మార్చేశారు. అధికారం కోల్పోయిన అదే పంధాను కొనసాగించారు.అయితే ఇకనుంచి మాత్రం ఆ పని కుదరదు.
* ఇక జైలు జీవితమే
అయితే ఐపీసీ స్థానంలో బిఎన్ఎస్ రావడంతోనే వైసిపి సోషల్ మీడియా ప్రతినిధుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. గతంలో మాదిరిగా 41 ఏ నోటీస్ కాకుండా.. 111 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తుండడం.. ఒకసారి కేసు నమోదు అయితే జైలు జీవితం తప్పదు. అందుకే వారిలో ఒకరకమైన ఆందోళన ప్రారంభమైంది. వైసిపి సోషల్ మీడియా విభాగంలో పనిచేసే వారంతా ఇప్పుడు బాధితులుగా మిగిలారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మంది వరకు ఇలాంటి వారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో పోస్టింగులతో ఆత్మహత్యలు ఎవరైనా చేసుకుంటే.. అలా పోస్టులు పెట్టిన వారు పై జీవిత ఖైదు కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే మరణ శిక్ష విధించే హక్కు కూడా కోర్టుకు ఉంది. అందుకే వైసిపి సోషల్ మీడియా ప్రతినిధులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ap govt filing bns 111 section case against ycp social media representatives
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com