Homeజాతీయ వార్తలుJaishankar: ట్రంప్‌ గెలుపుపై ఆందోళన.. విదేశాంగ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

Jaishankar: ట్రంప్‌ గెలుపుపై ఆందోళన.. విదేశాంగ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

Jaishankar: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో అడుగు పెట్టబోతున్నారు. ట్రంప్‌ 312 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. కమలా హారిస్‌ 226 మాత్రమే సాధించారు. దీంతో ట్రంప్‌ 2025, జనవరి 20న అమెరికా 47 అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అమెరికా కొత్త అధినేతకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ ట్రంప్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. ఈమేరకు ఎక్స్‌లో కూడా పోస్టు చేశారు. ఇక ట్రంప్‌ కూడా తన కేబినెట్, వైట్‌ కార్యవర్గం, పర్సనల్‌ అధికారుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. నిక్కీ హేలీని తన కార్యవర్గంలోకి తీసుకోనని ట్రంప్‌ ప్రకటించారు. టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌కు ట్రంప్‌ పాలనలో ప్రత్యేక పదవి దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ట్రంప్‌ ఎన్నికపై అమెరికాలో మహిళలు 4బీ ఉద్యమం మొదలు పెట్టారు. ఈతరుణంలో ట్రంప్‌ ఎన్నికపై బారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆందోళనలో చాలా దేశాలు..
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నిక కావడంతో ప్రపంచంలో చాలా దేశాలు ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు. అయితే వాటిలో భారత్‌ లేదని స్పష్టం చేశారు. ముంబైలో ఆదిత్య బిర్లా 25 సిల్వర్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షులుగా పనిచేసి పలువురితో సత్సంబంధాలు ఏర్పర్చుకున్నారు. మోదీ మొదట వాషింగ్‌టన్‌ డీసీని సందర్శించినప్పుడు బారక్‌ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత ట్రంప్, అనంతరం జో బైడెన్‌ అధ్యక్షులుగా ఉన్నారు. మోదీ అమెరికా అధ్యక్షులుగా ఉన్నవారితో సంబంధాలను సహజంగానే ఏర్పరుచుకుంటారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అనేక దేశాలు ట్రంప్‌ ఎన్నికపై ఆందోళన చెందుతున్నాయి. వాటిలో భారత్‌ లేదు’ అని స్పష్టం చేశారు.

మోదీపై ట్రంప్‌ ప్రశంసలు..
ఇదిలా ఉంటే ట్రంప్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా ట్రంప్‌ మోదీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచం అంతా మోదీవైపే చూస్తోందని పేర్కొన్నారు. మోదీ గొప్ప నాయకుడు అని పేర్కొన్నారు. అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు. ప్రపంచం మోదీని ప్రేమిస్తోందని తెలిపారు. మోదీ కూడా తమ స్నేహాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ట్రంప్‌ ఎన్నికతో రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని ఆకాంక్షించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular