AP Government: ఏపీలో ( Andhra Pradesh) నిరుద్యోగ యువతకు అరుదైన అవకాశం. ముఖ్యంగా యువతులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు ఏపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందుకుగాను ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. వారికి విదేశీ భాషలో శిక్షణ ఇస్తోంది. అటువంటివారు పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే విమాన టిక్కెట్లతో పాటు లక్షలాది రూపాయల జీతభత్యాలు అందించే ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఓ 22 మంది విదేశాలకు వెళ్లేందుకు శిక్షణ పూర్తి చేశారు. ఇది నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశం గా చెప్పవచ్చు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చాలా అవకాశాలు కల్పిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో నర్సుల ఉద్యోగాలకు ఏపీలో శిక్షణ ఇస్తుండడం విశేషం.
Also Read: మహిళలకు రూ.50 వేలు రుణం ఇస్తున్న ప్రభుత్వం.. వెంటనే ఇలా అప్లై చేసుకోండి..
* జర్మనీలో నర్సుల కొరత
ఏపీలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ప్రధానంగా జర్మనీలో( Germany ) నర్సుల కొరత తీవ్రంగా ఉంది. అక్కడ వృద్ధుల సంరక్షణ కోసం ఎక్కువగా నర్సులను ఆశ్రయిస్తారు. అందుకే జర్మనీ ప్రభుత్వం ఇతర దేశాల నుంచి నర్సులను నియమించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందుకే ఏపీ ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి జర్మనీలో ఉద్యోగాలు పొందేలా ఏర్పాటు చేస్తోంది. గుంటూరులో శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేసింది. ఎప్పటికీ ఎంపికైన ఓ 22 మందికి జర్మన్ భాషలో శిక్షణ ఇస్తున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు అయిన వారికి ఉచితంగా విమాన టిక్కెట్లు, విశ్వ అందించి నెలకు రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు జీతం పొందే అవకాశం కల్పిస్తున్నారు. నిరుద్యోగులకు ఇది గొప్ప అవకాశమే.
* ఏపీ ప్రభుత్వం ఫోకస్..
గతంలో జర్మనీ వెళ్లాలంటే ఏం చేయాలో? ఎక్కడ శిక్షణ తీసుకోవాలో? ఎవరిని సంప్రదించాలో తెలియక చాలామంది ఇబ్బంది పడేవారు. అయితే జర్మనీలో నిరుద్యోగుల కొరత దృష్ట్యా దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం( AP government). అక్కడ నర్సింగ్ విద్యార్థుల కొరత ఉందని తెలుసుకొని.. ఇప్పుడు ఇక్కడ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణా కేంద్రం నడుస్తోంది. అయితే నర్సులకు శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను శిక్షణ కేంద్రంగా ఎంపిక చేశారు. రాత, మౌఖిక పరీక్షల ద్వారా కోస్తాంధ్ర ప్రాంతం నుంచి 22 మందిని ఎంపిక చేశారు. గత ఏడాది డిసెంబర్ నుంచి శిక్షణ ప్రారంభం అయింది.
* నాలుగు స్థాయిల్లో పరీక్షలు..
అయితే శిక్షణలో అభ్యర్థులు నైపుణ్యం సాధించాల్సి ఉంటుంది. జర్మన్ భాషలో ( German language) ఏ 1, ఏ 2, బి 1, బీ2 స్థాయిలలో నైపుణ్యం సాధించాలి. ఇప్పటికే మూడు స్థాయిలకు సంబంధించి పరీక్షలు పూర్తయ్యాయి. చివరిగా బీ 2 పరీక్షను చెన్నైలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన వారికి మౌఖిక పరీక్ష ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణత సాధిస్తే జర్మనీలో ఉద్యోగానికి ఎంపికైనట్టే. అలా ఎంపికైన వారికి విమాన టికెట్లతో పాటు వీసా, ధ్రుపత్రాలు అన్ని ఉచితంగా అందిస్తారు. నెలకు రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల రూపాయల వరకు వేతనం అందిస్తారు. మొత్తానికి అయితే నిరుద్యోగుల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
Also Read: 11 ఏళ్ల విద్యార్థితో యువ టీచర్ జంప్.. ఏకంగా నాలుగు రాష్ట్రాలు తిరిగి..