Annapurna Yojana Scheme: అయితే ఈ సమాజంలో మహిళలు ఒక్క అడుగు ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తే వాళ్లను వెనక్కి నెట్టడానికి 100 అడుగులు సిద్ధంగా ఉంటాయి. అటువంటి మహిళల కోసం ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఎన్నో రకాల రుణ పథకాలను అమలు చేసింది. ఈ పథకాలలో అన్నపూర్ణ పథకం, ఉద్యోగ పథకం చాలా కీలకమైనవి అని చెప్పొచ్చు. ఈ పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందుతుంది. అన్నపూర్ణ పథకం ద్వారా ఫుడ్ వ్యాపారంలో ఉన్న మహిళలకు 50,000 వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ రుణాన్ని మహిళలు వంట సామాగ్రి, టిఫిన్ సర్వీస్ వంటి వాటికోసం ఉపయోగించుకోవచ్చు. అన్నపూర్ణ పథకం కింద తీసుకునే రుణాన్ని 36 నెలల్లో తిరిగి చెల్లించాలి. అయితే ఈ పథకానికి మొదటి నెల ఈఎంఐ ఉండదు. ఇక మహిళా వ్యాపారవేత్తలు ఉద్యోగిని పథకం కింద మూడు లక్షలు రుణం తీసుకోవచ్చు.
Also Read: ఓలా, ఏథర్‌కు ఇక కష్టాలు మొదలు.. బజాజ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది!
ఈ పథకం ప్రధాన లక్ష్యం మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడం మరియు వ్యాపార అవకాశాలను పెంచి స్వయం ఉపాధి కల్పించడం.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరంలో మహిళల కోసం ఈ పథకాలను మరింతగా విస్తరించి వాటిని గ్రామీణ మరియు పట్టణ ప్రాంత మహిళలకు కూడా సులభంగా అందుబాటులోకి ఉండేలాగా కృషి చేస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సహాయం ఇస్తామని హామీ ఇచ్చినా కూడా అది ఇంతవరకు అమలు కాలేదని తెలుస్తుంది. ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరియు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది.
అన్నపూర్ణ పథకం ముఖ్య ఉద్దేశం ఆహార వ్యాపారం లో రాణించాలి అనుకుంటున్నా మహిళలకు ఆర్థిక సహాయం అందించడం. అలాగే మహిళలకు స్వయం ఉపాధి కలిగేలాగా చేయడం. అన్నపూర్ణ పథకం కింద దరఖాస్తు చేసుకున్న మహిళలకు 50 వేల రూపాయలు ప్రభుత్వం రుణం ఇస్తుంది. వీటి ద్వారా మహిళలు వంట సామాగ్రి, టిఫిన్ సర్వీస్ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. అయితే అన్నపూర్ణ పథకం కింద తీసుకున్న రుణాన్ని 36 నెలల్లో ఆ మహిళలు సులభ వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. అయితే ఈ పథకంలో మొదటి నెల ఈఎంఐ ఉండదు. ఈ పథకంలో మహిళలు 50 శాతం కంటే ఎక్కువ యాజమాన్యం కలిగి ఉండాలి. అలాగే వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.