Uttar Pradesh: ఇటీవల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ నగర్ జిల్లాలో ఓ 50 ఏళ్ల మహిళ.. తనకు మనవడి వరస అయ్యే యువకుడితో లేచి పోయి పెళ్లి చేసుకుంది. చివరికి తన భర్తకు, పిల్లలకు అన్నంలో విషం పెట్టి చంపడానికి కూడా వెనుకాడ లేదు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీన్ని మర్చిపోకముందే గుజరాత్ లో మరో దారుణం చోటుచేసుకుంది. కాకపోతే ఈ ఘటనలో అడుగడుగునా సినిమాలు తలపించే మలుపులు చోటుచేసుకున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..
Also Read: సురేఖావాణి బర్త్ డే ట్రీట్, హాట్ వీడియో వైరల్, చాలదు బికినీలో కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్
గుజరాత్ రాష్ట్రంలో..
వస్త్రాల తయారీకి.. వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా ఉన్న సూరత్ లో ఓ యువ ఉపాధ్యాయురాలు (23) విద్యార్థులకు ట్యూషన్ చెబుతుంటుంది. ఈమె వద్దకు 11 సంవత్సరాల విద్యార్థి కూడా వస్తుంటాడు.. అయితే మొదట్లో వీరిద్దరి మధ్య ఉపాధ్యాయురాలు – విద్యార్థి సంబంధం మాత్రమే ఉండేది. పేరుకు 11 సంవత్సరాలు అయినప్పటికీ.. ఆ విద్యార్థి కాస్త వయసు ఎక్కువగానే కనిపిస్తుంటాడు. చూడగానే ఆకట్టుకునే రూపంతో అతడు ఉంటాడు. బహుశా అందువల్లే ఆ ఉపాధ్యాయురాలు అతడు అంటే ఇష్టాన్ని పెంచుకున్నట్టుంది. వారిద్దరి మధ్య సఖ్యత ఏర్పడడంతో.. ఇటీవల ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా నాలుగు రాష్ట్రాలు దాటిపోయారు. ఆ బాలుడు, యువ ఉపాధ్యాయురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే కొద్ది రోజులుగా వీరిద్దరి ఆచూకీ తెలుసుకోవడం కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. బుధవారం రాజస్థాన్ సరిహద్దులోని ఓ ప్రైవేట్ బస్సులో వారిద్దరూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే వారిద్దరూ నాలుగు రాష్ట్రాలు దాటారు. ఆ తర్వాత పోలీసులు వారిద్దరిని సూరత్ తరలించారు. అయితే ఆ ఉపాధ్యాయురాలు తన కుమారుడిని అపహరించిందని.. ఆ విద్యార్థి తండ్రి పోలీసులకు చెప్పడం విశేషం.. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం ఆ ఉపాధ్యాయురాలిని.. ఆ 11 సంవత్సరాల విద్యార్థిని వారి వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా విమర్శిస్తున్నారని తెలుస్తోంది. కుటుంబ సభ్యుల తిట్లు భరించలేక వారు బయటకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. సూరత్ లోని ఓ ప్రాంతంలో ఉపాధ్యాయురాలు, విద్యార్థి కుటుంబాలు పకపక్కనే నివసిస్తున్నాయి. రెండు కుటుంబాల మధ్య సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఆ విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేశాడో.. అప్పటినుంచి పోలీసులు దర్యాప్తును వేగంగా చేపట్టడం మొదలుపెట్టారు. సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా వారిద్దరి ఆచూకీ తెలుసుకోవడం మొదలుపెట్టారు..” వారిద్దరి మధ్య ఎటువంటి బంధం ఉందో తెలియదు. ముందే ఒక అంగీకారానికి రావడం కూడా సరైనది కాదు. వారి బయటికి వెళ్లిపోవడం వెనక అనేక కారణాలు ఉన్నాయి. మా దర్యాప్తులో వారు కొన్ని విషయాలు మాత్రమే చెప్పారు. ఇంకా చాలా విషయాలు వారు వెల్లడించాల్సి ఉంది. కాకపోతే నాలుగు రాష్ట్రాలు వారు దాటి వెళ్లిపోయారంటే.. రెండు కుటుంబాలలో ఏదో జరిగి ఉంటుంది. కాకపోతే ఆ విషయాలను మాకు వారు చెప్పడం లేదు. ఈ కేసు పై ఒక స్పష్టత రావాలంటే లోతుగా విచారణ జరపాలి. చుట్టుపక్కల వారిని కూడా విచారించాలి. అప్పుడే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడానికి అవకాశం ఉంటుందని” డిసిపి భగీరథ్ గడవీ వెల్లడించారు.. ఇక ఆ ఉపాధ్యాయురాలు, ఆ విద్యార్థి మధ్య సన్నిహిత సంబంధం ఉందని తెలుస్తోంది. అందువల్లే వారి ఇద్దరు ఇంట్లో నుంచి వెళ్లిపోయారని సమాచారం. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని.. కాకపోతే రాజస్థాన్ రాష్ట్రంలో ఉండగా పోలీసులు పట్టుకున్నారని.. స్థానిక మీడియాలో వార్తలు ప్రచురితమయ్యాయి.
Also Read: కుల గణన క్రెడిట్ ఎవరిది? కాంగ్రెస్ పోస్టర్‌తో రాజకీయ దుమారం!