AP Government : ఏపీ ప్రభుత్వం( AP government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రహదారులను పూర్తిగా మార్చేయాలని భావిస్తోంది. ఇందుకుగాను రెండు వేల కోట్ల రూపాయలను మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి ఆర్ అండ్ బి కీలక ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వం సైతం నాబార్డు, సాస్ కి నిధులు వెచ్చించే ఏర్పాట్లు చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారులపై గుంతలను పూడ్చింది. తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో రహదారులను బాగు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆర్ఎంపీ శాఖను ఆదేశించింది. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 4972 కిలోమీటర్ల మేర రహదారులను పునరుద్ధరించాలని ఆర్ అండ్ బి శాఖ ప్రభుత్వానికి నివేదించింది.
Also Read : సెలవులొచ్చాయి.. ‘బాబు’ చేసిన ఈ పని మాత్రం మెచ్చుకోవాల్సిందే
* గాలికి వదిలేసిన వైయస్సార్ కాంగ్రెస్ సర్కార్..
గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చారు. రహదారుల నిర్మాణానికి సంబంధించి పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. ఏపీలో ఒక్క జాతీయ రహదారులు తప్పించి.. మిగతా అన్ని రకాల రహదారుల నిర్వహణను గాలికి వదిలేసారన్న విమర్శ ఉంది. దీంతో ఏ రహదారి చూసినా ఏమున్నది గర్వ కారణం అన్నట్టు.. అంతర్ జిల్లా రహదారులు, గ్రామీణ రోడ్లు దారుణంగా తయారయ్యాయి. గుంతల్లో రోడ్లు వెతుక్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏపీ ప్రజలకు ఏర్పడింది. పక్క రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు రోడ్లను చూసి ఆశ్చర్యపోయేవారు. మరికొందరైతే బాహటంగానే విమర్శలకు దిగేవారు. కేవలం రహదారుల పుణ్యమా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంది కూడా.
* రహదారులపై ఫోకస్..
అయితే కూటమి( Alliance government ) అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రహదారులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రహదారులపై గోతులు పూడ్చాలని భావించింది. రాష్ట్రవ్యాప్తంగా వేల కిలోమీటర్ల మేర ఉన్న రహదారుల్లో గోతులను పూడ్చింది. అయితే ఇప్పటికీ చాలా వరకు గ్రామీణ రహదారులు బాగుపడలేదు. అవే గోతులు కొనసాగుతూ వచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రహదారులకు మోక్షం కలగకపోవడంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల పూర్తిస్థాయి మరమత్తులకు సంకల్పించింది. అటువంటి రహదారులపై అధ్యయనం చేయాలని రోడ్లు భవనాల శాఖకు ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రహదారులు అందుబాటులోకి రావాలంటే 2000 కోట్ల రూపాయలతో మరమ్మత్తులు చేపట్టాలని ఆర్ అండ్ బి ప్రభుత్వానికి నివేదించింది.
* నిధుల సమీకరణకు సిద్ధం..
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణకు సిద్ధపడింది. నాబార్డ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్( Nabard rural infrastructure development fund) ఇచ్చే 400 కోట్లతో 1247 కిలోమీటర్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మరో 1433 కిలోమీటర్ల కు సంబంధించిన రహదారులను కేంద్రం ఇచ్చే స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నిధులు కింద 600 కోట్లు కేటాయించనున్నారు. ఈ పనులకు రెండు రోజుల కిందట అనుమతులు కూడా మంజూరు చేశారు. గతంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధితో ఎంపిక చేసిన 2292 కిలోమీటర్ల రోడ్డు పనులు నిలిచిపోయాయి. వీటికి 1000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తంగా 2000 కోట్ల రూపాయలతో 4972 కిలోమీటర్ల పనులు చేపట్టనున్నారు. ఇందులో జిల్లా రహదారులు 3162 కిలోమీటర్లు, రాష్ట్ర రహదారులు 1810 కిలోమీటర్లు. మొత్తానికైతే ఏపీలో రహదారులకు ఒక రూపం తీసుకొచ్చే పనిలో పడింది కూటమి ప్రభుత్వం.
Also Read : 50 ఏళ్లకే పింఛన్.. మంత్రి కీలక ప్రకటన!