AP Pension
AP Government : ఏపీ ప్రభుత్వం( AP government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి వరుసగా సెలవులు. బ్యాంకులకు కూడా సెలవు దినాలు. రేపు ఆదివారం కాగా.. ఎల్లుండి రంజాన్. ఏప్రిల్ ఒకటిన పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండడం.. వరుసగా రెండు రోజులు బ్యాంకుకు సెలవులు కావడంతో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 29 శనివారం పింఛన్ మొత్తాలను సచివాలయ ఉద్యోగులకు అందించేందుకు నిర్ణయించారు. ముందుగానే బ్యాంకులకు జమ చేయడంతో సచివాలయం ఉద్యోగులు ఆ నగదు తీసుకోనున్నారు. ఏప్రిల్ ఒకటి మంగళవారం ఆ నగదును పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
Also Read : రాష్ట్రం ఏర్పడ్డాక 11 ఏళ్లకు ఆంధ్రాలో సెటిల్ అవుతున్న బాబు
* మరింత సరళతరం
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల విషయంలో చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది ఏపీ ప్రభుత్వం. అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని పెంచడంతోపాటు మూడు నెలల బకాయిలు కూడా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మూడువేల రూపాయలు ఉన్న పింఛన్ మొత్తాన్ని నాలుగువేల రూపాయలకు పెంచారు. పెంచిన మొత్తాన్ని మూడు నెలల పాటు వర్తింపజేసి పాత బకాయిలను సైతం అందించారు. ప్రతి నెల సచివాలయ ఉద్యోగులతో ఇంటింటా పింఛన్ల పంపిణీ విజయవంతంగా పూర్తి చేస్తున్నారు.
* సెలవు అయితే ముందు రోజే..
ప్రతి నెల ఒకటో తేదీన సెలవు దినాలు( leave days ) అయితే ఆ ముందు రోజే పింఛన్ అందించి లబ్ధిదారులకు కళ్ళల్లో ఆనందం నింపుతోంది కూటమి ప్రభుత్వం. అయితే ఈ నెలకు సంబంధించి మాత్రం 30, 31 తేదీల్లో సెలవులు కావడంతో బ్యాంకులు పనిచేయవు. అందుకే ఒక రోజు ముందుగానే బ్యాంక్ లకు నిధులు జమ చేశారు. ఆ నిధులను డ్రా చేసి తీసుకెళ్లాలని సచివాలయ ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ ఒకటి మంగళవారం పింఛన్ల పంపిణీ ప్రక్రియను ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు అందించే క్రమంలో జిల్లాల పర్యటన చేస్తున్నారు చంద్రబాబు. ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రకాశం జిల్లాలో ఏర్పాటు జరుగుతున్నాయి.
* దివ్యాంగుల విషయంలో సానుకూల నిర్ణయం…
మరోవైపు దివ్యాంగుల( physically handicapped ) పింఛన్ల విషయంలో మొన్న ఆ మధ్యన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్లు అందుకునేందుకు వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆది నుంచి పింఛన్ల పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం మాత్రం లబ్ధిదారుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ap government pension amounts for secretariat employees to be distributed to pension beneficiaries on april 1
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com