AP Government
AP Government : ఏపీ ప్రభుత్వం( AP government ) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలపై దృష్టి పెట్టింది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా 50 ఏళ్లకే పింఛన్ అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా శాసనమండలిలో ప్రకటించారు. 50 ఏళ్లకే పెన్షన్ హామీ, పింఛన్ల తొలగింపు వంటి అంశాలపై శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. దీనిపై స్పందించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తాం అన్న హామీని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రూపాయల పింఛన్ మొత్తాన్ని పెంచేందుకు ఐదు సంవత్సరాల సమయం తీసుకుందని.. తాము మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం అనర్హుల పెన్షన్ల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోందని స్పష్టతనిచ్చారు.
Also Read : మరో మూడు నెలలు ఇదే వ్యూహం.. మేలో విశ్వరూపం.. కూటమి సర్కార్ ప్లాన్ అదే!*
* ఎన్నికల హామీగా
అధికారంలోకి వస్తే బీసీ,ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలకు 50 ఏళ్లు దాటితే పింఛన్ అందిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు ( CM Chandrababu )హామీ ఇచ్చారు. అయితే అందుకోసం అర్హులైన నిరుపేదలందరికీ సామాజిక భద్రత పింఛన్లు అందేలా చూసేందుకు మంత్రివర్గ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ముందుగా అనర్హుల పింఛన్ల గుర్తింపు ప్రక్రియ చేపడుతున్నారు. జిల్లాల వారీగా అనర్హులు పెద్ద ఎత్తున బయటపడుతున్నారు. అర్హత లేకపోయినా పెన్షన్లు అందుకుంటున్న వారిని గుర్తించి తొలగిస్తున్నారు. అదే విషయాన్ని శాసనమండలిలో చెప్పుకొచ్చారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
* 15 లక్షల మంది గుర్తింపు..
రాష్ట్రంలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నవారు దాదాపు 15 లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు. అయితే వారికి పింఛన్ అందజేసే విధానంపై ఒక కార్యాచరణ రూపొందించాలని సీఎం ఇప్పటికే నిర్దేశించారు. మంత్రులతో పాటు అధికారులకు బాధ్యతలు కేటాయించారు. తాజాగా మంత్రి ప్రకటన చూస్తుంటే పింఛన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తేలిపోయింది. అయితే ఆది నుంచి పింఛన్ల విషయంలో టిడిపి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇప్పుడు కూడా కచ్చితంగా అమలు చేస్తోందన్న ధీమా అందరిలో కనిపిస్తోంది.
* లక్షల దరఖాస్తులు పెండింగ్
సామాజిక పింఛన్లకు( social pensions ) సంబంధించి 60 సంవత్సరాలు పైబడిన వారు సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కొత్త పింఛన్లు అందించిన దాఖలాలు లేవు. చాలామంది అర్హులు దరఖాస్తులు చేసుకున్నారు. లక్షలు గా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ముందుగా అనర్హుల పింఛన్లు తొలగింపు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. తరువాత 60 సంవత్సరాలు దాటిన అర్హులకు పింఛన్లు అందించే ప్రక్రియ ప్రారంభిస్తారు. అటు తరువాతే 50 ఏళ్ల పింఛన్లు పరిశీలించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : మత్స్యకారులకు రూ.20 వేలు భృతి అప్పుడే.. ఆ రెండు పథకాలు ఫిక్స్!
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pension at the age of 50 ministers key announcement
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com