AP Government : రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాలకు గాను జనాభా ప్రాతిపదికన 7,715 గ్రూపులుగా విభజించడం జరిగింది. ఈ క్రమంలో ప్రతి గ్రూపులో ఇంజనీరింగ్, ఎనర్జీ అసిస్టెంట్, వీఆర్వో లేదా సర్వే అసిస్టెంట్, ఏఎన్ఎం తప్పనిసరిగా ఉండేలాగా చూస్తున్నారు. అలాగే సాగు మరియు ఇతర అవసరాలకు సంబంధించి అదనపు సిబ్బందిని కూడా నియమించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ముఖ్య లక్ష్యంగా చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామ మరియు వార్డు సచివాలయాల వ్యవస్థలో ఇప్పటివరకు సమూల మార్పులు జరిగాయి. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామా మరియు వార్డు సచివాలయాలలో అధికారులను గ్రూపులుగా విభజించి సంబంధిత సచివాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులను పునర్విభజన చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయ శాఖ అధికారులకు తాజాగా ఉత్తర్వులను కూడా పంపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఉన్నాయి.
Also Read : జగన్ అరెస్ట్ అయితే వైసిపి బాధ్యతలు ఎవరికి?
దీనిని తాజాగా ప్రభుత్వం 7,715 గ్రూపులుగా విభజించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది. ప్రభుత్వం తాజాగా ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసి అన్ని సచివాలయాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభించింది. అన్ని సచివాలయాలలో ఉన్న జనాభా ప్రాతిపదికన ఈ పునర్వ్యవస్థీకణ ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రతి ఒక్క సచివాలయంలో కూడా ఏఏ కేటగిరీలో పోస్టులను తప్పకుండా భర్తీ చేయాలో అలాగే ఆయా సచివాలయాలలో సాంకేతిక సిబ్బంది ఎంతమంది ఉండాలో అనేదానిపై కూడా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక సచివాలయం లో కూడా ఇంజనీర్ అసిస్టెంట్ లేదా ఎనర్జీ అసిస్టెంట్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లేదా సర్వే అసిస్టెంట్, అసిస్టెంట్ నర్స్ మిడ్ వైఫరీ ఉండేలాగా చూస్తున్నారు.
ఆయా ప్రాంతాలలో ఉన్న సాగు పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ లేదా సెరికల్చర్ అసిస్టెంట్లను నియమించబోతుంది. ఫిషరీస్ అసిస్టెంట్ లేదా వెటర్నరీ అసిస్టెంట్లలో కూడా ఒకరిని ఆయా ప్రాంతాలలో ఉన్న సచివాలయాలలో నియమించబోతున్నారు. అలాగే ఆయా సచివాలయాలలో ఇంకా అదనపు సిబ్బంది అవసరం అయితే వారిని కూడా ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది. తాజాగా కూటమి ప్రభుత్వం చేపట్టిన పునర్వ్యవస్థీకరణ కారణంగా అన్ని సచివాలయాలలో కూడా గ్రూపులో అవసరమైన ప్రతి ఒక సిబ్బంది ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం కారణంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు సరైన సమయంలో అందుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.