KA Paul
“ఏంది తల్లికి వందనమా..
తండ్రికి అప్పడమా
తాతకు పప్పడమా
అవ్వకి ముంజులంటూ
అత్తకు తాటికాయలు
మామకు ఉసిరికాయలు” ఇదేదో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ అనుకునేరు.. ఇవన్నీ కూడా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలు.
KA Paul: సాధారణంగా రాజకీయ నాయకులు విమర్శలు చేసుకున్న సమయంలో ఒకటే ఫ్లో ఫాలో అవుతుంటారు. అందులో ఎటువంటి చతురత.. హాస్యం ఉండదు. పైగా రొడ్డ కొట్టుడు మాటలతో రాజకీయ నాయకులు రాసే పాత్రికేయులను.. వినే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అయితే కొంతమంది చేసే ప్రసంగాలు గొప్పగా అనిపిస్తుంటాయి. వారు చేసే విమర్శలు నవ్వు తెప్పిస్తుంటాయి.. ఆ తర్వాత ఆలోచింపజేస్తుంటాయి. అలాంటి ప్రసంగాలు చేయడంలో కేఏ పాల్ తర్వాత ఎవరైనా. ఇప్పుడంటే జనం అతడిని కమెడియన్ గా చూస్తున్నారు గాని.. ఒకప్పుడు అతడు అద్భుతమైన వక్త. అతడి ప్రసంగాల కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూసేవి. ప్రపంచ శాంతి మహాసభలు పెట్టినప్పుడు అతని ప్రసంగాల కోసం లక్షల మంది జనాలు తరలి వచ్చేవారు. కాకపోతే 2004 తర్వాత చోటు చేసుకున్న సంఘటనల వల్ల కేఏ పాల్ ఓ కమెడియన్ అయిపోయారు. ఆయనకున్న చరిష్మా తగ్గిపోయింది.
Also Read: ఇతడేమో కాలభైరవ.. ఆమె మిత్రవింద.. చూసే జనాలు వెర్రివాళ్లు.. వైరల్ వీడియో
ఆరు గ్యారెంటీ లపై విమర్శలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో నాడు కూటమిగా ఏర్పడ్డ టిడిపి, జనసేన, బిజెపి నాయకులు ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. వాటికి సూపర్ సిక్స్ పథకాలు అంటూ నామకరణం చేశారు. వైసీపీపై తీవ్ర అగ్రహంతో ఉన్న ప్రజలు ఎన్నికల్లో కూటమి నేతలకు పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చినప్పటికీ కూటమి నేతలు హామీలను అమలు చేయలేకపోయారు. అయితే దీనిపై వైసిపి (ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ) ఉద్యమాలు చేస్తోంది. నిరసనలు వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదు. వైసీపీలో వ్యూహాత్మకంగా మాట్లాడే నాయకుడు లేకపోవడమే ఆ పార్టీకి ప్రధాన శాపం. అయితే అప్పుడప్పుడు కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతుంటారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ కేఏ పాల్ తనదైన శైలిలో విమర్శలు చేశారు.
” ఏంది తల్లికి వందనమా..
తండ్రికి అప్పడమా
తాతకు పంపడమా
అవ్వకు ముంజలంటూ
అత్తకు తాటికాయలు
మామకు ఉసిరికాయలు” అంటూ కేఏ పాల్ విమర్శలు చేశారు. ఒక ఫ్లోలో కేఏ పాల్ మాట్లాడటంతో.. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీనిని వైసీపీ శ్రేణులు తెగ ప్రచారం చేస్తున్నాయి. ఇదే సమయంలో టిడిపి నేతలు వైసిపి నాయకులకు కౌంటర్ ఇస్తున్నారు. మీ పార్టీలో మాట్లాడే నాయకుడు లేక.. చివరికి కేఏ పాల్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. మొత్తానికి కేఏ పాల్ చేసిన విమర్శల వల్ల అటు టిడిపి, ఇటు వైసిపి నాయకులు సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారు.
ఇదేం ర్యాగింగ్ అయ్యా పాల్ మావా….
ఏందీ తల్లి కి వందనమా♂️
తండ్రి కి అప్పడమా
తాత కు పప్పడమా
అవ్వకి ముంజలంటా
అత్తకి తాటికాయలు
మామ కి ఉసిరికాయలు pic.twitter.com/b0TaKkghAs— Dynamite Reddy (@BlastChesthaa) March 19, 2025