Pawan Kalyan-Botsa Satyanarayana
Pawan Kalyan : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో( AP assembly sessions ) ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఈరోజు తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫోటో సెషన్స్ కు దిగారు. గ్రూప్ ఫోటో తీయించుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మండలి లో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. కాగా బొత్స సత్యనారాయణకు దగ్గర్లో పవన్ కళ్యాణ్ కూర్చున్నారు. దీంతో వీరి మధ్య మాటామంతి కుదిరింది. ఓ కీలక అంశం చర్చకు వచ్చింది.
Also Read : జగనన్నది తప్పే.. చంద్రబాబుపై షర్మిల ఫైర్!
* ఆత్మీయ పలకరింపులు
ముందుగా బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana )పవన్ కళ్యాణ్ ను ఎలా ఉన్నారు అంటూ పలకరించారు. దీంతో బాగానే ఉన్నట్లు పవన్ జవాబు ఇచ్చారు. గ్రూప్ ఫోటో అనంతరం తిరిగి వెళుతున్న సమయంలో మరోసారి పవన్ తో బొత్స మాట కలిపారు. ఢిల్లీ నుంచి వచ్చాక ఎప్పుడు అసెంబ్లీకి వస్తారంటూ పవన్ ను అడిగారు. ఎప్పుడు వస్తారో చెబితే కొల్లేరులో అటవీ శాఖ సర్వే వల్ల నష్టపోతున్న రైతులు వచ్చి మిమ్మల్ని కలుస్తారని అడిగారు. దీంతో తాను ఎప్పుడు వచ్చేది త్వరలోనే చెబుతానని బొత్స సత్యనారాయణకు పవన్ తెలిపారు. ఢిల్లీ నుంచి రాగానే కొల్లేరు ఆక్వా రైతులను కలుస్తానని బొత్సకు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
* కొల్లేరులో అటవీ శాఖ సర్వే
ప్రస్తుతం కొల్లేరు అటవీశాఖ సర్వే( Forest Department survey ) నిర్వహిస్తోంది. సుప్రీంకోర్టులో కొల్లేరు ఆక్రమణల కేసు కారణంగా ఈనెల తొమ్మిది నుంచి ఈ పరిశీలన కొనసాగుతోంది. దీనిపై మూడు నెలల్లోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని గత ఏడాది డిసెంబర్లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో కొల్లేరు పిటిషన్ పై విచారణ జరగబోతోంది. దీంతో అటవీ శాఖ సర్వే వల్ల చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఆ రైతుల తరఫున పవన్ కళ్యాణ్ ను అపాయింట్మెంట్ అడిగారు బొత్స. దీనిపై పవన్ సానుకూలంగా స్పందించారు.
* ఇద్దరి మధ్య చనువు..
గతంలో కూడా పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan) బొత్స చనువుగా గడిపిన సందర్భాలు ఉన్నాయి. ఓ సందర్భంలో శాసనసభ వద్ద పవన్ కళ్యాణ్ కు బొత్స ఎదురుపడ్డారు. ఆ క్రమంలో ఇద్దరు నేతలు పరస్పరం నమస్కరించుకొని పలకరించుకున్నారు. ఆత్మీయ ఆలింగనం సైతం చేసుకున్నారు. ఆ సమయంలో సీనియర్ నేత పెద్దిరెడ్డి తో పాటు మరికొందరు వైసీపీ నేతలు ఉన్నారు. బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ ను చూసి నేరుగా ఆయన వద్దకు వెళ్లారు. వైసీపీ నేతలు మాత్రం అప్పట్లో సైడ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తో బొత్సకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ తరుణంలో బొత్స జనసేనలో చేరుతారని ఒకానొక దశలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. కానీ ఇద్దరి మధ్య చనువు మాత్రం ఉండడం విశేషం.
Also Read : పిఠాపురం ఇన్చార్జిగా నాగబాబు.. తీవ్ర అంతర్మధనంలో వర్మ