https://oktelugu.com/

 YS Sharmila : నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నాడు

 YS Sharmila : చంద్రబాబు సర్కార్ తీరుపై విమర్శలు చేశారు. చంద్రబాబు తీరు చూస్తుంటే అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటువంటి చర్యలను మానుకోవాలని హితవు పలికారు.

Written By: , Updated On : March 19, 2025 / 04:37 PM IST
YS Sharmila

YS Sharmila

Follow us on

YS Sharmila : ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను పున సమీక్షిస్తోంది. ముఖ్యంగా వైయస్సార్ పేరు పై ఫోకస్ పెట్టింది. గతంలో ఉన్న స్థానిక సంస్థలు, జిల్లాల పేర్లలో మార్పులు చేస్తోంది. దీనిపై వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల ( YS Sharmila)స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు సర్కార్ తీరుపై విమర్శలు చేశారు. చంద్రబాబు తీరు చూస్తుంటే అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇటువంటి చర్యలను మానుకోవాలని హితవు పలికారు.

Also Read : పురందేశ్వరి టచ్ లో జూనియర్ ఎన్టీఆర్.. కథేంటి?

* నాడు తప్పు జరిగింది
అయితే తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ) పేరు తొలగింపు పై ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల.. నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలను కూడా ఎండగట్టారు. అప్పట్లో స్వర్గీయ ఎన్టీఆర్ పేరు మార్చి వారి అభిమానుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడ్డారు. అందుకే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రతికరం తీర్చుకుంటుందన్నారు. కోట్లాదిమంది తెలుగు ప్రజల హృదయాలను ఇది గాయపరిచిందన్నారు. వైయస్సార్ జిల్లాలో తిరిగి వైయస్సార్ కడప జిల్లా పేరుతో సవరించడంలో అభ్యంతరం లేదన్నారు. కానీ కృష్ణాజిల్లా తాడిగడప మున్సిపాలిటీకి వైయస్సార్ పేరును తొలగించడం మాత్రం ఖండిస్తున్నట్లు తెలిపారు షర్మిల.

* ఫాస్ట్ రియాక్షన్
వైయస్సార్ పేరు మార్పు విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress )ఇంతవరకు స్పందించలేదు. కానీ ఈ విషయంలో షర్మిల దూకుడుగా ఉన్నారు. నేరుగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గతంలో షర్మిల కేవలం జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తారని అంతా భావించారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబును ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఎందుకు అంత కక్ష అని నిలదీశారు. వైయస్సార్ జిల్లాలో తిరిగి కడప పేరు చేర్చినప్పుడు.. విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు ఎన్టీఆర్ విజయవాడ అని ఎందుకు చేర్చలేదని కూడా ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తు చేశారు. అటువంటి నేతకు రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also Read : గ్రేటర్ పీఠం వైసీపీ నుంచి చేజారినట్టే.. పాపం ఆ ఇద్దరు నేతలు!