Shanti: ఏపీ ప్రభుత్వం ( AP government)ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ జిల్లాలో దేవాదాయ శాఖ అక్రమాల విషయంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో వైసిపి పెద్దలకు ఓ దేవాదాయ శాఖ అధికారి అనుకూలంగా పనిచేశారన్న విమర్శ వచ్చింది. మరోవైపు వ్యక్తిగతంగా కూడా చాలా రకాల ఆరోపణలు వచ్చాయి సదరు అధికారిణి పై. ఈ క్రమంలోనే వైసిపి హయాంలో కీలక నేత ఆదేశాలకు అడుగులు మడుగులు ఒత్తుతూ సదరు మహిళ అధికారి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ప్రధానంగా నాటి వైసిపి నేత విజయసాయిరెడ్డి తో ఆమెకు ఉన్న బంధం పై అనేక రకాల ప్రచారం నడిచింది. వారిద్దరి వ్యక్తిగత జీవితంపై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలు చేసింది సదరు మహిళ అధికారి స్వయానా భర్త. ఈ క్రమంలోనే ఈ అంశం పెను వివాదాలకు దారి తీసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఇదో పెను దుమారంగా మారింది. అయితే తాజాగా సదరు మహిళ అధికారిపై నిర్బంధ పదవీ విరమణ వేటు పడినట్లు తెలుస్తోంది. కేవలం విజయసాయిరెడ్డి కి పేవర్ చేశారనే ఆరోపణలకు ఆమె మూల్యం చెల్లించుకున్నట్లు ప్రచారం నడుస్తోంది.
Also Read: కవిత కోపం హరీశ్‌పై కాదా.. మరి టార్గెట్ ఎవరు?
* వివాదాలు చుట్టుముట్టడంతో..
దేవాదాయ శాఖలో( endowment department ) అత్యంత వివాదాస్పదంగా మారారు మహిళా అధికారిణి శాంతి. ఆమె శాఖా పరమైన అంశాలతో పాటు వ్యక్తిగత అంశాలపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే తాజాగా కంపల్సరీ రిటైర్మెంట్ విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉంది. గత నెల 16న ఏకంగా షాకాజ్ నోటీస్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆ నోటీస్కు ఆమె సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆమె సమర్పించిన వివరణలు దేవాదాయ శాఖను సంతృప్తి పరచలేకపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆమె వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
* వైవాహిక జీవితంలో..
ప్రధానంగా వైవాహిక జీవితానికి సంబంధించిన వివాదం ఆమెకు ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. తన మొదటి భర్త మదన్మోహన్ తో చట్టబద్ధంగా విడాకులు పొందకుండానే.. సుభాష్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్న విషయం పెద్ద చర్చకు దారితీసింది. ఈ చర్య ఏపీ సివిల్ సర్వీసు నియమావళి లోని రూల్ 25 కు విరుద్ధమని అధికారులు భావిస్తున్నారు. అయితే శాంతి తన వివరణలో చాలాకాలంగా మొదటి భర్త నుంచి విడిపోయిన తరువాత మాత్రమే తాను రెండో వివాహం చేసుకున్నానని పేర్కొన్నారు. అయితే క్షేత్రస్థాయిలో విచారణలో మాత్రం ఆమె విడాకులు తీసుకోకుండానే రెండో వివాహం జరిగినట్లు స్పష్టమవుతోంది.
* అనేక వివాదాస్పద నిర్ణయాలు..
వైసిపి( YSR Congress) హయాంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా ప్రభుత్వ విచారణలో తేలింది. వైసీపీ హయాంలో విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆమె దేవాదాయ శాఖ అధికారిగా పనిచేశారు. ఆ హోదాలో ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఆలయ భూముల పరిరక్షణలో ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగాలు ఉన్నాయి. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే విచారణలో ఆమె సమర్పించిన వివరణలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో.. ప్రభుత్వం నుంచి సానుకూలత లేకపోవడంతో.. నిర్బంధ పదవీ విరమణ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమె నిర్బంధ పదవీ విరమణకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..!