AP Education Department : నేటితో విద్యా సంవత్సరం( academic year) ముగియనుంది. రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. జూన్ 12న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. అన్ని యాజమాన్యాల పరిధిలో ఉండే పాఠశాలలు వేసవి సెలవులు ఇవ్వాల్సిందేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఇంటర్ కు సంబంధించి కూడా ఇవే సెలవులు వర్తించనున్నాయి. ఈ ఏడాది ఇంటర్ విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఏప్రిల్ 1న ఇంటర్ తరగతులు ప్రారంభమయ్యాయి. తిరిగి రేపటి నుంచి కాలేజీలు మూతపడనున్నాయి. జూన్ 1న తెరచుకోనున్నాయి. మరోవైపు పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత శాఖ డైరెక్టర్ విజయరామరాజు సర్కులర్ జారీ చేశారు.
Also Read : ఏపీలో ఎండల ఎఫెక్ట్.. మారిన ఒంటిపూట బడుల షెడ్యూల్!
* చివరి పని దినం నేడు..
ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాఠశాలలకు చివరి పని దినం గా( last working day) బుధవారం అని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూన్ 12న పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి. అయితే భారత వాతావరణ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సూచనల ప్రకారం వేసవి సెలవుల్లో మార్పులకు అవకాశం ఉంటుందని కూడా సర్కిలర్లో పొందుపరిచారు. అయితే పాఠశాలల ఉపాధ్యాయులు మాత్రం జూన్ 5 నుంచి విధులకు హాజరుకావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్టేట్ సిలబస్ అమలు చేస్తున్న అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఆ తేదీన విధుల్లో చేరాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు ఇంటర్ కాలేజీలు మాత్రం జూన్ 1న తిరిగి ప్రారంభం అవుతాయి. ఈసారి విద్యార్థులకు 50 రోజులపాటు వేసవి సెలవులు దక్కనున్నాయి.
* కొత్త పాఠ్యపుస్తకాల ముద్రణ
మరోవైపు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త పాఠ్యపుస్తకాల ముద్రణ( text books printing ) ఇప్పటికే ప్రారంభించారు. పాఠశాలలు తెరిచే తొలిరోజు అంటే జూన్ 12న కిట్ల రూపంలో కొత్త పాఠ్యపుస్తకాలు అందించనున్నారు. మరోవైపు విద్యా సంవత్సరం ముగియడంతో డిప్యూటేషన్ల పై పనిచేస్తున్న ఉపాధ్యాయులు విధుల నుంచి రిలీవ్ అయి.. చివరి పని దినమైన ఏప్రిల్ 23న పాత పాఠశాలల్లో చేరాల్సి ఉంటుంది. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వందలాదిమంది ఉపాధ్యాయులు జిల్లాల్లో డిప్యూటేషన్ల పై పనిచేస్తూ వచ్చారు. అటువంటి వారు తిరిగి యధా స్థానంలోకి చేరాల్సి ఉంటుంది.
* జూన్ 12న కిట్ల పంపిణీ..
పాఠశాల విద్యాశాఖకు సంబంధించి కీలక మార్పులు జరిగాయి. ఇప్పటికే పాఠశాలల్లో ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, బూట్లతో పాటు అన్ని రకాల వస్తువులతో కిట్లు అందించిన సంగతి తెలిసిందే. పాఠశాలలు తిరిగి తెరిచే సమయానికి అంటే.. జూన్ 12న కిట్లు అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
Also Read : ‘భరత్ అనే నేను’.. మహేష్ లా.. సీఎం జగన్ సాధించాడు..