AP Govt Schools: ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ బాబు ఏపీలోని విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తాడు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి అందరికీ ఉచితంగా ఆంగ్ల మాధ్యమాన్ని బోధిస్తాడు. ఒకసారి ఏపీ పాఠశాలలను సందర్శించగా.. అక్కడ విద్యార్థిని ఇంగ్లీష్ లో ప్రశ్నిస్తాడు. దానికి ఆ విద్యార్థి ఇంగ్లీష్ లోనే సమాధానమిచ్చి ‘మహేష్’ ఆశలకు జీవం పోస్తాడు.
ఇంగ్లీష్ మీడియం చదువులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఎంతలా తీర్చిదిద్దుతాయో అందరికీ తెలిసిందే. సీఎం జగన్ కూడా ‘భరత్ అనే నేను’ సినిమాను ఫాలో అయ్యారు. అధికారంలోకి రాగానే ఎంత మంది వ్యతిరేకించినా ప్రభుత్వ బడుల్లో ‘ఇంగ్లీష్ మీడియం చదువులను ప్రవేశపెట్టారు.
Also Read: Balakrishna Another Surgery: బాలయ్య కి మరో సర్జరీ.. ఆందోళనలో ఫాన్స్
ఉపరాష్ట్రపతి వెంకయ్య నుంచి మొదలుపెడితే.. టీడీపీ అధినేత చంద్రబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకూ అందరూ వ్యతిరేకించినా కూడా ఎవరి మాట వినకుండా జగన్ మొండిగా ముందుకెళ్లారు. ఏపీ భావిభారత పౌరుల కోసం ఎంతమంది వ్యతిరేకించినా వారి భవిష్యత్ బాగుండాలని ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. అదే ఇప్పుడు వరమైంది.
ఏపీ ప్రభుత్వపాఠశాలల్లోని పేద పిల్లలు ఆంగ్ల మాధ్యమాన్ని నేర్చుకున్నారు. గలగలా మాట్లాడుతున్నారు. ఏపీలోని బెల్టపూరి అనే గ్రామంలోని విద్యార్థి పాఠశాల ఈ విద్యాసంవత్సరంతో ముగిసిందని.. తనకు ఎలా ఇంగ్లీష్ వస్తుందా? ఎలా నేర్చుకున్నామో వివరించి చెప్పింది. ఆమె మాటల ప్రవాహానికి ఆంగ్ల భాష తొణికిసలాడినట్టైంది.
ఏపీలో జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం చదువులు ఎంతలా విద్యార్థులను రాటుదేల్చాయో.. ఎంతలా ప్రభావితం చేశాయన్న దానికి ఈ వీడియోనే ఉదాహరణ అని వైసీపీ శ్రేణులు తెగ వైరల్ చేస్తున్నారు.
Also Read:High Temperatures: 122 ఏళ్లలో ఎన్నడు చూడని వేడి.. ఎండలతో జాగ్రత్త సుమా?
Recommended Videos
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Bendapudi government school students speaking foreign slang video
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com