Car Sales : హ్యుందాయ్ మోటార్ ఇండియా, కియా ఇండియా ఈ రెండు దక్షిణ కొరియాకు చెందిన సిస్టర్ కంపెనీలే. అయినప్పటికీ, ఆయా కంపెనీ కార్లలో చాలా వైవిధ్యం కనిపిస్తుంది. తాజాగా రెండు కంపెనీలు తమ 2024-25 ఆర్థిక సంవత్సరం అమ్మకాల గణాంకాలను విడుదల చేశాయి. ఈ డేటా అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తోంది.
Also Read : టాప్ 10 కార్లు.. భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే!
హ్యుందాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. 2024-25లో భారతదేశంలో అమ్ముడైన కార్లలో అత్యధికంగా SUV వాహనాలే ఉన్నాయి. కంపెనీ మొత్తం అమ్మకాల్లో దాదాపు 68.5 శాతం కేవలం SUVల అమ్మకాల ద్వారానే వచ్చింది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో SUVల వాటా 63.2 శాతం కంటే కూడా ఎక్కువ. అయితే, ఈ సమయంలో హ్యుందాయ్ మొత్తం అమ్మకాల్లో 2.61 శాతం క్షీణత నమోదైంది.
మరోవైపు, కియా ఇండియా మొత్తం అమ్మకాలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 4 శాతం మేరకు పెరిగాయి. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువగా SUV లేదా MPV కార్లే ఉన్నాయి. అయినప్పటికీ, కియా ఏ SUVల కారణంగా భారతీయ మార్కెట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందో, వాటి అమ్మకాల్లోనే భారీ క్షీణత కనిపించింది. కియా సెల్టోస్ అమ్మకాలు 2024-25లో 28 శాతం తగ్గి 72,618 యూనిట్లకు చేరుకున్నాయి. 2023-24లో దీని అమ్మకాలు 1,00,423 యూనిట్లుగా ఉన్నాయి.
దేశంలోని రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో హ్యుందాయ్ క్రెటా, వెన్యూ, ఎక్స్‌టర్, అల్కాజార్, టక్సన్, అయోనిక్ 5 వంటి కార్లు ఉన్నాయి. అయితే కియా పోర్ట్‌ఫోలియోలో సోనెట్, సెల్టోస్, కారెన్స్, సైరోస్, కార్నివాల్ వంటి పెద్ద కార్లు ఉన్నాయి.
SUVల అమ్మకాల్లో వృద్ధి కేవలం హ్యుందాయ్ లేదా కియా విషయంలోనే కాదు. దేశంలోని మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కూడా పంచ్, నెక్సాన్‌తో పాటు సఫారి, కర్వ్, హారియర్ వంటి SUVలను విక్రయిస్తోంది. కంపెనీకి చెందిన టాటా పంచ్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVగా నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో టాటా పంచ్ 1,96,572 యూనిట్లు అమ్ముడయ్యాయి. SUVలకు పెరుగుతున్న డిమాండ్ స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read : ‘ఆడి’ని వెనక్కి నెట్టిన ల్యాండ్ రోవర్.. అమ్మకాల్లో రికార్డ్
