Homeఎంటర్టైన్మెంట్Ajith : హీరో అజిత్ పై సంచలన ఆరోపణలు చేసిన స్టార్ హీరోయిన్..!

Ajith : హీరో అజిత్ పై సంచలన ఆరోపణలు చేసిన స్టార్ హీరోయిన్..!

Ajith : వివాదాలకు ఆమడదూరం లో ఉండే సౌత్ హీరోల లిస్ట్ తీస్తే అందులో తమిళ హీరో అజిత్ కుమార్(Thala Ajith Kumar) పేరు కచ్చితంగా వినిపిస్తుంది. అందరి హీరోలలాగా అజిత్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో పాల్గొనడం వంటివి చేయడు. అయినప్పటికీ కూడా ఆయన సినిమా విడుదలైతే టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు వస్తుంటాయి. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో ఆయన. తమిళనాడు టాప్ 2 స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ కి నిన్న కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్(Padma Bhushan) అవార్డుతో సత్కరించింది. ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ పురస్కారం అందుకున్న సందర్భంగా అజిత్ కి టాలీవుడ్ సెలబ్రిటీల నుండీ శుభాకాంక్షలు వెలువడ్డాయి. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంటి వారు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసారు.

Also Read : మరోసారి పల్టీలు కొట్టిన హీరో అజిత్ కార్..వణుకుపుట్టిస్తున్న విజువల్స్!

అయితే అజిత్ పద్మభూషణ్ అవార్డు ని అందుకున్న సందర్భంగా సీనియర్ హీరోయిన్ హీరా రాజ్ గోపాల్(Heera Rajgopal) సోషల్ మీడియా వేదికగా పలు సంచలన ఆరోపణలు చేసింది. ఆమె మాట్లాడుతూ ‘ నా కెరీర్ ప్రారంభం లో నేను ఒక హీరోతో పీకల్లోతు బలమైన రిలేషన్ ని నడిపాను. ఆ హీరో ఎవరో మీ అందరికీ తెలుసు. కానీ నన్ను అతను ఒక చీటర్ గా, చెడు అలవాట్లకు బానిసని అయినా అమ్మాయిగా ఈ సమాజానికి చూపించాడు. నా క్యారక్టర్ ని అందరి ముందు దిగజార్చడమే కాకుండా, నన్ను అత్యంత క్రూరమైన విలన్ గా జనాల్లో ముద్ర వేశాడు. వయస్సు లో ఉన్నప్పుడు అతనే నా ఇంటికి వెతుక్కుంటూ వచ్చాడు. నేను అతనికి అన్ని విధాలుగా మద్దతుగా నిల్చాను. చివరికి అతనికి వెన్నుముక ఆపేరేషన్ జరిగి హాస్పిటల్ లో కదల్లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక పని మనిషి లాగా సేవలు చేశాను. చివరికి అతని బెడ్ ప్యాన్ లను కూడా మార్చాను. ఆ సంఘటన తర్వాత అతను నన్ను పూర్తి పట్టించుకోవడం మానేసాడు. కలవడానికి వెళ్తే కలవనివ్వలేదు, ఫోన్ చేస్తే అనుదుబాటులోకి వచ్చేవాడు కాదు, నన్ను అకస్మాత్తుగా అంత దూరం పెట్టాడు’.

‘ఇక అతని అభిమానులు అయితే నాపై కక్ష కట్టి అనేక సార్లు నా ఇంటి పై దాడికి దిగారు. నా పరువుని, గౌరవాన్ని దిగజార్చి, చివరికి నా భద్రతకు కూడా భంగం కలిగేలా చేశారు. వాళ్ళ కారణంగానే నేను సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. ఒకానొక దశలో అఘాయిత్యం కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేసాను. ఇన్ని రకాలుగా నన్ను టార్గెట్ చేసిన తర్వాత ఒకరోజు నాన్ని మీటింగ్ కి పిలిచాడు. ఎందుకు ఇలాంటివన్నీ చేసి నన్ను ఇబ్బంది పెట్టావు అని అడిగితే ‘నేను త్వరలోనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను, నేను తప్ప ఆమెపై ఎవ్వరు కన్నెత్తి కూడా చూడకూడదు. అలాగే నాకు కావాల్సిన వాళ్ళతో శృంగారం చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ ఒక్క మాట తో నా హృదయం ముక్కలైంది’ అంటూ ఆమె ‘హీరా ఆలయ’ వెబ్ సైట్ లో రాసుకొచ్చింది.

Also Read : నెలకు 15 కోట్లు..5వ తేదీ దాటితే నిర్మాతలకు చుక్కలే అంటున్న అజిత్!

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular