Hyundai i10 : ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి వ్యాగన్‌ఆర్ గత 25 ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. కానీ ఇప్పుడు 6 లక్షల లోపు ధర కలిగిన ఒక హ్యాచ్‌బ్యాక్ కారు దాని రికార్డును బద్దలు కొట్టింది. ఆ కారు మరేదో కాదు. హ్యుందాయ్ ఐ10. ఇది భారతదేశంలో 18ఏళ్ల కిందట విడుదల అయింది. ఇప్పుడు మారుతి వ్యాగన్ఆర్ ను వెనక్కి నెట్టింది.
హ్యుందాయ్ ఈ కారు మొదటిసారిగా 2007లో భారతీయ మార్కెట్‌లో రిలీజ్ అయింది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా అందించిన తొలి కార్లలో ఇది ఒకటి. అంతేకాకుండా ఏబీఎస్, కీ లేకుండా డోర్ లాక్ వంటి స్పెషల్ ఫీచర్లను మన దేశానికి పరచియం చేసింది. ఇప్పుడు ఇది మారుతి వ్యాగన్‌ఆర్ అమ్మకాల రికార్డును అధిగమించింది.
Also Raed : రూ.80వేలు చెల్లించి ఈ కారును ఇంటికి తీసుకెళ్లండి..
మారుతి వ్యాగన్‌ఆర్ తన 25 సంవత్సరాల ప్రయాణంలో దాదాపు 34 లక్షల యూనిట్లను విక్రయించింది. అయితే హ్యుందాయ్ ఐ10 కేవలం 18 సంవత్సరాలలోనే 33 లక్షల యూనిట్ల అమ్మకాల రికార్డును సృష్టించింది. దీని 3 జనరేషన్ మోడల్స్ ఇప్పటివరకు మార్కెట్‌లో విడుదలయ్యాయి. అవి హ్యుందాయ్ ఐ10, గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ10 నియోస్.
హ్యుందాయ్ ఐ10 దాదాపు 20 లక్షల యూనిట్లు మన దేశంలో అమ్ముడయ్యాయి. మరో 13 లక్షల యూనిట్లను కంపెనీ భారతదేశంలో తయారు చేసి 140 దేశాలకు ఎగుమతి చేసింది. హ్యుందాయ్ ఈ కారును దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ వంటి మార్కెట్లలో విక్రయించింది.
హ్యుందాయ్ ఐ10 మూడు జనరేషన్ మోడల్స్‌లోనూ కంపెనీ పవర్ ఫుల్ ఇంజిన్ ఆప్షన్‌లను అందించింది. ప్రస్తుతం హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 1.2 లీటర్ పెట్రోల్ మాన్యువల్, 1.2 లీటర్ పెట్రోల్ ఏఎమ్‌టి, 1.2 లీటర్ బై-ఫ్యూయల్ పెట్రోల్ సీఎన్‌జి పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లతో వస్తుంది. భారతదేశంలో ప్రతేడాది హ్యుందాయ్ ఐ10 దాదాపు లక్ష యూనిట్లు అమ్ముడవుతున్నాయి.
హ్యుందాయ్ ఐ10 నియోస్ ప్రారంభ ధర రూ.5.98 లక్షల నుండి మొదలై రూ.9.70 లక్షల వరకు ఉంటుంది. ఈ సిరీస్‌లో లేటెస్ట్ ఎంట్రీ అయిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ను 2019లో భారతీయ మార్కెట్‌లో విడుదల చేశారు. దీని అత్యధిక అమ్మకాలు గుజరాత్, మహారాష్ట్ర, హర్యానాలో బాగున్నాయి. ఈ కారును కొనుగోలు చేసిన వారిలో 83 శాతం మంది వివాహితులు, 45 శాతం మంది మొదటిసారి కొనుగోలు చేసిన వారు ఉన్నారు.
హ్యుందాయ్ ఐ10 మారుతి వ్యాగన్‌ఆర్ రికార్డును అధిగమించింది. ఈ కారు డిసెంబర్ 1999లో భారతదేశంలో విడుదలైంది. ఇప్పటివరకు దీని 33.7 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. మారుతి వ్యాగన్‌ఆర్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా 1.98 లక్షల యూనిట్లను విక్రయించింది. ఇది మనదేశంలోని మధ్యతరగతి ప్రజల అభిమాన కారు. 4 నుంచి ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి ఇది సరైన కారు. ఈ కారు బాక్సీ డిజైన్ కారణంగా మంచి హెడ్‌రూమ్ లభిస్తుంది. ఇది పొట్టి, పొడవైన వ్యక్తులందరికీ నచ్చుతుంది. కుటుంబానికి అనుగుణంగా దీని క్యాబిన్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది.
Also Read : మూడు కార్లను అప్ గ్రేడ్ చేసిన ఫీచర్స్ గురించి తెలిస్తే దిమ్మదిరుగుద్ది..