spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Constituency Increase 2029 Elections: ఏపీలో భారీగా పెరగనున్న నియోజకవర్గాలు!

AP Constituency Increase 2029 Elections: ఏపీలో భారీగా పెరగనున్న నియోజకవర్గాలు!

AP Constituency Increase 2029 Elections: ఏపీలో( Andhra Pradesh) అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు పెరగనున్నాయి. మరోసారి నియోజకవర్గాల పునర్విభజన తెరపైకి వచ్చింది. 2029 ఎన్నికల నాటికి పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసేందుకు కేంద్రం సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఏపీలో భారీగా శాసనసభ సీట్లు త్వరగా ఉన్నాయి. 263 అసెంబ్లీ స్థానాలు, 38 వరకు లోక్సభ స్థానాలు చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఆశావహులకు అరుదైన అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన కోసం రాజకీయ పార్టీల నేతలు ఎదురుచూస్తూనే ఉన్నారు. మొన్న రాష్ట్ర విభజన సమయంలోనే ఈ నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉండేది. కానీ రకరకాల కారణాలతో ఈ ప్రక్రియ మొదలు కాలేదు. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దీనిపై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?

* 50% పెంచాలని నిర్ణయం..
పునర్విభజనలో భాగంగా ఇప్పుడున్న శాసనసభ, పార్లమెంటు స్థానాలను ఏకంగా 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం( central government) నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే దేశంలో ఇప్పుడు ఉన్న పార్లమెంట్ స్థానాలు సంఖ్య 534 నుంచి 816 కు చేరుకోనుంది. ఇక అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం 4123 గా ఉన్న అసెంబ్లీ సీట్లు ఏకంగా 6185 కు పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ సీట్లను 263 కు పెంచే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం 119 ఉన్న అసెంబ్లీ స్థానాలు 179 కి చేరి చాన్స్ కనిపిస్తోంది. పార్లమెంట్ సీట్లకు సంబంధించి ఏపీలో ప్రస్తుతం 25 స్థానాలు ఉన్నాయి. 38 కి పెరిగే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్ సభ స్థానాలు ఉండగా.. 26 కు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు సోమవారం ఎన్డీఏ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కేంద్రం కాంగ్రెస్ పార్టీతో సైతం చర్చించి పరిస్థితి ఉంది.

* అంచనాలను తెర దించుతూ..
నియోజకవర్గాల పునర్విభజనపై అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ వాటన్నింటిని కొట్టి పారేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ముందుగా పార్లమెంట్ సమావేశాల్లో( Parliament sessions ) మహిళా రిజర్వేషన్ చట్టం, డి లిమిటేషన్ చట్టాలకు సవరణలను ప్రతిపాదిస్తూ బిల్లులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం డి లిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పెంపు పై ఫోకస్ పెడుతుంది. 2029 నాటికి అన్ని పనులు పూర్తి చేసి.. వచ్చే ఎన్నికల నుంచి పెరిగిన సీట్లు అమలు చేయనున్నట్లు సమాచారం. అయితే నియోజకవర్గాల సంఖ్య పెరిగితే రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని తెలుస్తోంది.

* తాజా జనాభా లెక్కల ప్రకారం..
కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్ల కోసం 2023 సెప్టెంబర్ లో బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2034 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే నిబంధన ఉంది. కానీ 2027 మార్చినాటికి జనగణన పూర్తి కానుండడంతో.. జనాభా లెక్కల వివరాల ప్రకారం.. ప్రాథమిక నిర్ధారణకు వచ్చి నియోజకవర్గాల పునర్విభజనను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. రాజకీయ ఆశావహులకు నిజంగా ఇది గుడ్ న్యూస్.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version