Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేశాయి. తను చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం షేక్ చేసే సినిమాలను చేశాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్ గా ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న చిరంజీవి 400 కోట్ల క్లబ్లో చేరిపోయాడు.
Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?
ఇక ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో సైతం భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక చిరంజీవి తన సన్నిహితులతో గాని సినిమా మేకర్స్ తో గాని ఎంత జోవియల్ గా ఉన్నప్పటికి ఒక విషయం మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడట. సినిమా స్క్రిప్ట్ కు సంబంధించిన విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తాడని తన సన్నిహితులైతే చెబుతున్నారు.
ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయిన లేదంటే అతనికి ఇంతకుముందు భారీ సక్సెస్ ని కట్టబెట్టిన దర్శకుడైన కూడా కథ విషయంలో క్లారిటీగా లేకపోతే ఆయన సినిమా చేయనని చెప్పేస్తారట. ఇక అలాంటి చిరంజీవి ఒక సినిమా చేశాడు అంటే ఆ కథలో ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన కథల విషయంలో అలాగే దర్శకులు తెరకెక్కించే సీన్స్ విషయం లో సైతం చాలా క్లారిటీ మైంటైన్ చేస్తూ ఉంటారట.
అందువల్లే ఆయనకు చాలా వరకు సక్సెస్ రేట్ ఉందని పలువురు సినిమా మేధావులు సైతం చెబుతున్నారు…70 సంవత్సరాల వయసులో కూడా ఆయన సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఇప్పుడున్న యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ డిఫరెంట్ సినిమాలను ఎంచుకొని మూవీస్ చేయడం ప్రతి మెగా అభిమానిని గర్వపడేలా చేస్తుంది…
