Homeఆంధ్రప్రదేశ్‌YSRCP Credit Politics: ఏం జరిగినా మా చలువే ఏపీలో వైసిపి క్రెడిట్ చోరీ...

YSRCP Credit Politics: ఏం జరిగినా మా చలువే ఏపీలో వైసిపి క్రెడిట్ చోరీ పాలసీ

YSRCP Credit Politics: ఏపీకి ఏదైనా పరిశ్రమ, పెట్టుబడి వస్తే అది మా చలువే అనే ప్రకటన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తుంది. మేం అప్పుడు ప్రయత్నించాం కనుక.. ఇప్పుడు అది సాధ్యమైంది అనే మాట వినిపిస్తూ ఉంటుంది ఆ పార్టీ నుంచి. వాస్తవానికి గత ప్రభుత్వంలో ఏపీకి పరిశ్రమ మాటకాని… పెట్టుబడి అనే పదం కానీ మచ్చుకైనా వినిపించేది కాదు. అయితే బటన్ అనే మాట మాత్రం ప్రతిధ్వనించేది. కేవలం నవరత్నాల అమలే జగన్ లక్ష్యం అన్నట్టు అప్పట్లో వైసీపీ పాలన నడిచింది. వైసిపి హయాంలో ఏ ఒక్క పరిశ్రమ తీసుకురాలేకపోయారన్న విమర్శను మూటగట్టుకున్నారు. ఉన్న పరిశ్రమలను తరిమేసారన్న అపవాది కూడా ఆ ప్రభుత్వం పై ఉంది. అయితే ఏపీలో అధికారం కోల్పోయి రెండేళ్లు అవుతోంది. అయితే ఏపీకి ఎటువంటి పెట్టుబడి వచ్చినా.. అది మా కృషి, మా చలువ అన్నట్టు జగన్ అండ్ కో ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా తమ క్రెడిట్ అన్నట్టు సాక్షిలో డిబేట్ మొదలుపెట్టారు.

Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?

* ఎన్నికల ప్రచారంలో ఆ మాటలేవి
2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు గుర్తు చేస్తే.. ఆ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల గురించి ఇట్టే అర్థమవుతుంది. ఎన్నికల ప్రచారంలో జగన్ తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పాలనలో నొక్కిన బటన్ల గురించి, పంచిన ఉచితాల గురించి మాత్రమే చెప్పి ప్రజలను ఓట్లు అడిగారు. కానీ ఫలానా పరిశ్రమ తెచ్చాం.. ఫలానా పెట్టుబడులు తెచ్చాం అని మాత్రం చెప్పలేదు. తీరా అటువంటి పెట్టుబడులు ప్రారంభం అయ్యేసరికి.. పరిశ్రమలు ఏర్పాటు అయ్యేసరికి మాత్రం క్రెడిట్ కోసం ఇప్పుడు ఆరాటపడుతున్నారు.

* ఒక్కో ప్రాజెక్ట్ పట్టాలెక్కించిన వైనం..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. విశాఖలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇటువంటి వాటి ప్రస్తావన లేదు. 2024 ఎన్నికల్లో కూడా వీటిపై ప్రచారం చేసుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి విషయంలో కదలిక రావడం.. ప్రజల నుంచి సానుకూల స్పందన రావడంతో ఈ క్రెడిట్ మొత్తం వైసీపీకి చెందాలి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఆయన ఒక్కరే కాదు ఆ పార్టీ కార్యకర్త నుంచి సాక్షి మీడియా వరకు.. వైసిపి సోషల్ మీడియా వరకు అదే తరహా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పుడు దాదాపు లక్ష 35 వేల కోట్ల రూపాయలతో అనకాపల్లి జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. దాని క్రెడిట్ కూడా చోరీ చేసేందుకు సాక్షి మీడియా సిద్ధపడుతోంది. ఇక మీడియాలో డిబేట్లే డిబేట్లు. వరుస కథనాలు రావడం ఖాయం. అయితే ప్రజలు అలవాటు పడిపోయారు. ఇటువంటి డిబేట్లో చెప్పిన మాటలకు తెర వెనుక ఉన్న అర్థాలను గ్రహిస్తున్నారు. అందుకే ఇటువంటి క్రెడిట్ చోరీ ప్రయత్నాలు వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper
Exit mobile version