AP Cabinet: పక్కా లెక్కలు… 17 మంది కొత్తవారితో ఏపీ మంత్రి వర్గం.. బాబు వ్యూహమిదే*

సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రి వర్గాన్ని రూపొందించారు. సగానికి పైగా కొత్తవారికి అవకాశం ఇచ్చారు. 17 మంది కొత్త వారే. ముగ్గురు మహిళలకు చోటు దక్కింది.

Written By: Dharma, Updated On : June 12, 2024 8:57 am

AP Cabinet

Follow us on

AP Cabinet: మరి కొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తో పాటు మరో 23 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ ఒక్కరే ఉంటారు. పవన్ సహ మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు. జనసేనకు మూడు, బిజెపికి ఒక స్థానం కేటాయించారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రి వర్గాన్ని రూపొందించారు. సగానికి పైగా కొత్తవారికి అవకాశం ఇచ్చారు. 17 మంది కొత్త వారే. ముగ్గురు మహిళలకు చోటు దక్కింది.

మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న వారిలో.. కొణేదల పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కింజరాపు అచ్చెనాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సత్య కుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ ఎం డి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోల బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మిడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు.

క్యాబినెట్లో సామాజిక సమతూకం పాటించారు. ఎనిమిది మంది బీసీలకు అవకాశం ఇచ్చారు. ఇద్దరు ఎస్సీలకు, ఎస్టిలో ఒకరికి, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశం ఇచ్చారు. వాస్తవానికి మంత్రుల జాబితాను ముందే ప్రకటించాల్సి ఉంది. కానీ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాలతో చర్చించేందుకు చంద్రబాబు వెయిట్ చేయవలసి వచ్చింది. కేంద్ర పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత జాబితాను ప్రకటించారు.