AP Basavatarakam Cancer Hospital: అమరావతి రాజధాని( Amaravati capital ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి విషయంలో కదలిక వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఏకకాలంలో ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. అదే సమయంలో ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన భూముల్లో సైతం నిర్మాణాలు ప్రారంభించారు సంబంధిత యాజమాన్యాలు. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణం కూడా ప్రారంభం అయింది. సరిగ్గా ఇదే సమయంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అమరావతి రాజధానిలో ఓ నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. రేపే ముహూర్తంగా నిర్ణయించారు.
Also Read: ‘వార్ 2’ నుండి 28 సన్నివేశాలను కత్తిరించిన సెన్సార్ బోర్డు..ఎన్టీఆర్ కి అన్యాయం?
21 ఎకరాల భూమి కేటాయింపు..
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి( Basava tharakam Cancer Hospital ) నందమూరి బాలకృష్ణ చైర్మన్ గా ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాదులో ఉన్న ఈ ఆసుపత్రి వేలాదిమందికి వైద్య సేవలు అందిస్తోంది. అందుకే అటువంటి ఆసుపత్రి అమరావతిలో సైతం ఏర్పాటు చేయాలని బాలకృష్ణ భావించారు. అమరావతిని రాజధానిగా చేసిన తరువాత తుళ్లూరు సమీపంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం 21 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుడతామన్న సమయంలో రాష్ట్రంలో అధికారం మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఐదేళ్లపాటు బసవతారకం ఆసుపత్రి నిర్మాణం ఊసు లేకుండా పోయింది.
Also Read: ప్రభుత్వ వాహనంలో తిరగడం పై స్పందించిన నిధి అగర్వాల్..సంచలనం రేపుతున్న ట్వీట్!
రేపు శంకుస్థాపన..
తాజాగా కూటమి అధికారంలోకి వచ్చింది. నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) విజ్ఞప్తి మేరకు బసవతారకం ఆసుపత్రికి మరో ఆరు ఎకరాలను అక్కడే కేటాయించారు. దీంతో నందమూరి బాలకృష్ణ ఎక్కడ ఆసుపత్రి నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఒకసారి వచ్చి అక్కడ స్థలాన్ని పరిశీలించారు. అయితే బసవతారకం ఆసుపత్రి నిర్మిస్తున్న ప్రాంతంలో హై టెన్షన్ విద్యుత్తు వైర్లు ఉన్నాయి. వాటిని తొలగించాలన్న విజ్ఞప్తి మేరకు సీఆర్డీఏ అధికారులు ఏపీ ట్రాన్స్ కో కు లేఖ రాశారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులు వాటిని తొలగించారు. ఆసుపత్రి నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగాయి. దీంతో రేపే ఆసుపత్రి నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేశారు. బాలకృష్ణ దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. కాగా బసవతారకం ఆసుపత్రి మూడు దశల్లో నిర్మించేందుకు నిర్ణయించినట్లు బాలకృష్ణ సీఆర్డీఏ అధికారులకు తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలని బాలకృష్ణ కృత నిశ్చయంతో ఉన్నారు.