AP Annadata Sukhibhava: రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ తో( pm Kisan) పాటు అన్నదాత సుఖీభవ నిధుల జమకు ముహూర్తం ఫిక్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పేరిట.. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు సాగు సాయం కింద నగదు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటికి సంబంధించిన అర్హుల జాబితాను సిద్ధం చేశారు. అభ్యంతరాలపై రైతులకు అవకాశం కల్పించారు. వీటికి సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తి కావడంతో.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.7 వేలు అందించేందుకు నిర్ణయం తీసుకున్నాయి. నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రేపు ప్రధాని శ్రీకారం..
ప్రధానమంత్రి కిసాన్ సమాన్( pm Kisan ) నిధి పేరిట కేంద్రం సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. 20వ విడత నిధులకు సంబంధించి రేపు బీహార్లో ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేసి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ పథకం కింద నిధులు విడుదల చేస్తోంది. 19వ విడత నిధులను 2025 ఫిబ్రవరిలో విడుదల చేశారు. అయితే ఈసారి కాస్త జాప్యం జరిగింది. అందుకే రేపు విడుదలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పిఎం కిసాన్ ద్వారా దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. అయితే ఇప్పుడు పీఎం కిసాన్ అమలు చేస్తుండడంతో అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read: AP Rain updates: ఏపీలో ఏంటీ వాతావరణం.. ఆ జిల్లాలకు అలెర్ట్!
మూడు విడతల్లో సాయం..
పిఎం కిసాన్ ద్వారా 2000 రూపాయల చొప్పున 3 విడతల్లో అందిస్తోంది కేంద్రం. దానికి 14 వేల రూపాయలను జతచేయునుంది ఏపీ ప్రభుత్వం( AP government). కేంద్రం మాదిరిగానే మూడు విడతల్లో అందించేందుకు నిర్ణయించింది. తొలి రెండు విడతల్లో కేంద్రంతో పాటు 5000 చొప్పున.. చివరి విడత 4వేల రూపాయల చొప్పున అందించనుంది. అయితే రేపు గాని ప్రధాని పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తే.. ఏపీలో అన్నదాత సుఖీభవ సైతం విడుదల కానుంది. ఒకవేళ వాయిదా పడితే మాత్రం ఈ నెల 20న పక్కా అని తెలుస్తోంది.
ఈ కేవైసీ తప్పనిసరి..
అయితే పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) నిధులు జమ కావాలంటే రైతులు ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి. మరోవైపు పేమెంట్ స్టేటస్ తెలుసుకునేందుకు కేంద్రం వార్తలను అందుబాటులోకి తెచ్చింది. అందులో పథకానికి సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే అన్నదాత సుఖీభవ పై చాలా రోజులుగా ఊగిసలాట జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు దానిపై స్పష్టత వచ్చింది. రేపు లేదా ఈనెల 20న ఖచ్చితంగా రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశం ఉంది.