Screenplay vs Story: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని సాధించడం అనేది ఎంత ఆశామాషీ వ్యవహారమైతే కాదు. ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా సంవత్సరాల పాటు అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరమైతే ఉంటుంది. ఇక్కడ అనేక ఇబ్బందులు ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడగలిగిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో రాణించగలుగుతారు. ఇక ఇండస్ట్రీలో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కూడా మొదట్లో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. సరైన సమయంలో డబ్బులు రావు మంచి అవకాశాలు వచ్చినట్టే వచ్చి జారిపోతూ ఉంటాయి. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న తర్వాత మాత్రమే ఇక్కడ స్టార్ స్టేటస్ ని అనుభవిస్తూ ఉంటారు… ముఖ్యంగా ఒక సినిమా సక్సెస్ అయితే ఆ సినిమాకి పనిచేసిన వాళ్లందరికి మంచి పేరు అయితే వస్తోంది. మరి సినిమా సక్సెస్ కావాలంటే మొదట దానికి ఒక మంచి కథ అయితే కుదరాలి. అప్పట్లో చాలా మంది చాలా రకాలుగా మంచి కథలను అందించి సూపర్ సక్సెస్ లను అందుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో కథా రచయితలు అనేవారు లేకుండా పోయారు. దర్శకులే వాళ్ళ కథలను రాసుకొని సినిమాలుగా తెరకెక్కిస్తుండడం వల్ల అంత క్వాలిటీ కథలైతే రావడం లేదు. దానివల్ల ప్రేక్షకుల్లో కొంతవరకు నిరాశ అయితే ఎదురవుతుంది.
Also Read: పవన్ కళ్యాణ్ కే ఎసరు పెడుతున్న ఎన్టీఆర్…
మరి ఏది ఏమైనా కూడా అసలు కథ అంటే ఏంటి కథకి, స్క్రీన్ ప్లే కి మధ్య ఉన్న సంబంధం ఏంటి కథ రచయితల వల్ల సినిమాకి వచ్చే లాభమేంటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…అప్పట్లో కథ రచయితలు సెపరేట్ గా ఉండటం వల్ల వాళ్ళు ఎంతసేపు కథ గురించే ఆలోచించేవారు. దానివల్ల మంచి కథలను అందించడం వల్ల సినిమాలు సూపర్ సక్సెసులనైతే సాధించేవి…
కానీ ఇప్పుడు ఎవరికి వారే కథలను రాసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళకి కథల మీద సరైన అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు. దానివల్ల సినిమాల్లో సక్సెస్ రేట్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఒక రకంగా కథ రచయిత కథను రాసుకున్న తర్వాత అందులో ఏ స్కిన్ తర్వాత ఏ సీన్ రావాలి బట్టి అనేది స్క్రీన్ ప్లే…
Also Read: అల్లు అర్జున్ ఆ ఒక్క సినిమాతో చాలా వరకు వెనకబడ్డాడా..?
అయితే సీన్స్ ఒక ఫ్లో ఆర్డర్లో వచ్చినప్పుడే ఆ సినిమా ప్రేక్షకుడికి నచ్చుతోంది. కాబట్టి ఆ ఆర్డర్ ని సెట్ చేయడమే స్క్రీన్ ప్లే…ఎక్కడైతే గ్రాఫ్ పైకి లేవాలి, ఎక్కడ డౌన్ అవ్వాలి లాంటివి భాగమై ఉంటాయి. ఒక కథ రాసిన తర్వాత దాన్ని స్ట్రైయిట్ గా చెప్తే అంతగా ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు. అందుకే ఏవేవి దాచాలో వాటిని దాచి ట్విస్ట్ ల రూపంలో రివిల్ చేస్తూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా కథ, స్క్రీన్ ప్లే బాగున్నప్పుడు సినిమా ఆటోమేటిగ్గా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది వాస్తవం…