Pawan Kalyan vs Jr NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికి స్టార్ హీరోలు మాత్రం వరుస సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు… పాన్ ఇండియాలో ఎవరు ఎన్ని సక్సెస్ లను సాధిస్తే అంత పెద్ద స్టార్ హీరోగా ఎదిగారు కాబట్టి దాన్ని మైండ్ లో పెట్టుకొని మన స్టార్ హీరోలు ముందుకు అడుగులు వేస్తున్నారు…ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ఇప్పటికీ వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి…ఇక ఇప్పుడు వార్ 2(War 2) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పిస్తుందని చాలామంది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది తెలియాలంటే మాత్రం ఆగస్టు 14వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటికే వరసగా ఏడు విజయాలతో మంచి ఊపు మీదున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే వరుసగా ఎనిమిది విజయాలను తన ఖాతాలో వేసుకున్న వాడవుతాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు మీద ఉన్న రికార్డ్స్ అయితే బ్రేక్ చేయగలుగుతాడు. కెరియర్ స్టార్టింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా ఏడు విజయాలను అందుకున్నాడు.
Also Read: నితిన్ ను దిల్ రాజు బలిపశువును చేశాడా? ‘ఎల్లమ్మ’ పరిస్థితేంటి..?
ఆయన డైరెక్షన్ లో వచ్చిన జానీ (Johnny) సినిమాతో మొదటిసారి ఫ్లాప్ ను చవి చూశాడు. ఆయన ఆ తర్వాత ఒక నాలుగు సంవత్సరాల పాటు ఎలాంటి సక్సెస్ ని అందుకోకుండా వరుస ప్లాప్ లను మూట గట్టుకున్నాడు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా వరుసగా 7 సక్సెస్ లను అందుకొని సమానంగా ఉన్నారు.
వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ సక్సెస్ ని సాధిస్తే పవన్ కళ్యాణ్ రికార్డును బ్రేక్ చేసి జూనియర్ ఎన్టీఆర్ ముందకు దూసుకెళ్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమాతో ఈనెల ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read: అల్లు అర్జున్ ఆ ఒక్క సినిమాతో చాలా వరకు వెనకబడ్డాడా..?
ఒకవైపు ఆయన పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉంటూనే మరోవైపు ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటిని కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…